ఎస్బీఐ బ్యాంకు ఎప్పటికప్పుడు కొత్త సర్వీసు లను అందిస్తూ వస్తుంది.. ఇప్పటికే ఎన్నో కొత్త స్కీమ్ లను అందిస్తూ వస్తుంది. ఇప్పుడు మరో కొత్త సర్వీసును అందుబాటు లోకి తీసుకువచ్చింది. తొలిసారి వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని ప్రారంభించింది. ఎస్‌బీఐ ఖాతాదారులు చాలా కాలంగా ఈ సర్వీస్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ ఖాతాదారులు వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.. బ్యాంకు అందించే సర్వీసుల కోసం బ్రాంచ్‌కు లేదా ఏటీఎంకు వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా వరకు సేవలు వాట్సప్ ద్వారా లభిస్తాయి. బ్యాంకు కస్టమర్లు వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని పొందాలనుకుంటే ముందుగా +919022690226 నెంబర్‌ ను తమ స్మార్ట్‌ఫోన్‌ లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నెంబర్‌ కు Hi అని టైప్ చేసి మెసేజ్ చేయాలి..


ఆ తర్వాత వచ్చే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. అయితే అంతకన్నా ముందు కస్టమర్లు వాట్సప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం SMS WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ టైప్ చేసి 917208933148 నెంబర్‌ కు ఎస్ఎంఎస్ పంపాలి.. మీకు బ్యాంకు నుంచి మెసేజ్ వస్తుంది. మీకు కావాల్సిన ఆప్షన్ ను ఎంచుకోవాలి.. వాట్సప్ ఉపయోగిస్తున్న ఎస్‌బీఐ కస్టమర్లందరూ ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. అయితే ఎస్‌బీఐ అకౌంట్‌ తో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌ తో మాత్రమే వాట్సప్ బ్యాంకింగ్ సేవలు లభిస్తాయి.


ఇప్పటికే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్ల కు వాట్సప్ ద్వారా సేవలు లభిస్తున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అకౌంట్ వివరాలు, రివార్డ్ పాయింట్స్, ఔట్‌ స్టాండింగ్ బ్యాలెన్స్, కార్డ్ పేమెంట్స్ మొదలగు సేవల ను అందిస్తుంది.. ఈ సేవల ద్వారా బ్యాంకుకు వెళ్ళే పని తప్పుతుందని కస్టమర్లు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: