ఇప్పుడు అందరు కూడా ఆన్లైన్ ద్వారా డబ్బులను పంపిస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో బ్యాంకింగ్ వ్యవస్థలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే కరోనా పుణ్యమా అని.. ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోయాయి..క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. దీంతొ వీటి వినియోగం కూడా పెరిగి పోయాయి.ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్ ఎక్కువైపోయాయి.
 

ఈ క్రమంలోనే ఒకవేళ మీరు ఆన్‌లైన్ లావాదేవీ కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ఉపయోగించినట్లయితే, మీ డబ్బు తప్పుడు ఖాతాకు వెళితే, ఇకపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సులభమైన మార్గం ద్వారా మీ డబ్బు వాపసు పొందవచ్చు. మరి అదెలాగో ఇక్కడ తెలుసుకోండి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ తో ఈ రోజుల్లో ఆర్ధిక లావాదేవీలు బాగా జోరుగా సాగుతున్నాయి. సెకన్ల వ్యవధిలోనే మీరు ఎవరికైనా డబ్బును పంపొచ్చు. దీని కోసం మీరు బ్యాంకుకు కూడా వెళ్లవలసిన అవసరం లేదు.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం, ఒకవేళ తప్పుడు ఖాతాకు డబ్బును బదిలీ చేసినట్లయితే, మీరు వెంటనే RBI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. దీంతో పాటు బ్యాంకు శాఖకు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.వారు దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు.మొదటిగా ఈ bankingombudsman.rbi.org.in లింక్‌ను సందర్శించండి. ఆ తర్వాత మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా రీఫండ్ కోసం మీరు బ్యాంకుకు దరఖాస్తును సమర్పించాలి. దీనితో పాటు, మీరు మీ బ్యాంక్ ఖాతా, మీరు పొరపాటున డబ్బు పంపిన ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలియజేయాలి.అక్కడ కంప్లైంట్ చెయ్యాల్సి ఉంటుంది..

ఎలా ఫిర్యాదు చెయ్యాలి?

ముందుగా NPCI వెబ్‌సైట్‌ని సందర్శించి.. ఆ తర్వాత ఫిర్యాదు చేయడానికి.. ‘Dispute Redressal Mechanism’ ట్యాబ్ క్లిక్ చేయాలి. అప్పుడు మీరు లావాదేవీ వివరాలు, ఇష్యూ, లావాదేవీ ID, బ్యాంక్, మొత్తం అమౌంట్, లావాదేవీ తేదీ, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ వంటి సమాచారాన్ని పూర్తి చేయాలి. తద్వారా మీ రీఫండ్ ఫిర్యాదును ఫైల్ చేయగలరు. అలాగే డబ్బు పంపిన వ్యక్తి తిరిగి ఇవ్వకపోతే.. మీరు దీని గురించి అకౌంట్‌కు సంబంధించిన బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌తో మాట్లాడవలసి ఉంటుంది. అతడు ఆ వ్యక్తితో మాట్లాడటం ద్వారా మీ డబ్బును తిరిగి పొందవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి: