రాజధాని వివాదం విచారణ సందర్భంగా సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల్లో ఎవరికీ నోళ్ళు లేవటంలేదు. కేసు విచారణ సందర్భంగా సుప్రింకోర్టు చేసిన అనేక వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మూడురాజధానుల కాన్సెప్టుకు అనుకూలంగా ఉన్నట్లే అనిపిస్తోంది. మొత్తం ఏడు అంశాల్లో ఐదింటిలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రింకోర్టు స్టే ఇచ్చింది. దాంతోనే యావత్ ఎల్లోబ్యాచ్ కు షాక్ కొట్టినట్లయ్యింది.





ఇక విచారణ సందర్భంగా ఇద్దరు జడ్జీలు చేసిన అనేక కామెంట్లతో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తో పాటు సీపీఐ రామకృష్ణ, బీజేపీ నేతలకు కూడా నోట మాటరావటంలేదు. జడ్జీల వ్యాఖ్యలు ప్రజల్లో ఎక్కడ సానుకూలంగా వెళిపోతాయో అన్న భయంతోనే ఎల్లోమీడియా పూర్తి రివర్సులో కథనాలు, వార్తలను అందించింది. పైకి ఎల్లోమీడియా ఏమి మాట్లాడుతున్నా లోలోపల వాళ్ళకీ తెలుసు వాస్తవాలు ఏమిటో. అందుకనే చంద్రబాబు అండ్ కో ఎక్కడా నోరిప్పకుండా మొత్తం వ్యవహారాన్ని ఎల్లోమీడియా ద్వారానే నడిపించేస్తున్నారు.





జడ్జీల వ్యాఖ్యలు గనుక నిజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండుంటే సోమవారం మధ్యాహ్నం నుండే చంద్రబాబు, చినబాబు, పవన్, రామకృష్ణ లాంటి వాళ్ళు జాతరలో ఎగిరినట్లు ఎగురుతుండే వాళ్ళనటంలో సందేహంలేదు. తాజా వ్యాఖ్యలను చూసిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఎలాగుంటుందో బహుశా యావత్ ఎల్లోబ్యాచ్ కు అర్ధమైపోయినట్లుంది. అందుకనే నిలయవిధ్వాంసులందరు  ఎల్లో ఛానళ్ళల్లో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోయారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళు మీసాలు తిప్పుతు ప్రభుత్వానికి చాలెంజులు చేయటమే విచిత్రంగా ఉంది.





ఎవరేమి రాసుకున్నా, టీవీ డిబేట్లలో మాట్లాడినా చంద్రబాబు, పవన్, రామకృష్ణ లాంటి వాళ్ళు సుప్రింకోర్టు వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడటానికి ఎందుకని మొహం చాటేశారు అనే ప్రశ్నకు సమాధానం దొరకటంలేదు. వీళ్ళంతా మొహాలు దాచుకోవటంతోనే వీళ్ళ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు ఏమిటో జనాలందరికీ అర్ధమైపోయింది. కాబట్టి ఎల్లోమీడియా ఇచ్చే కవరింగ్ అంతా చంద్రబాబు అండ్ కో భయాన్ని దాచటానికి తప్ప ఇంకదేనికీ పనికిరాదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: