జయహో బీసీ సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు రాబోయే ఎన్నికలే చంద్రబాబునాయుడుకు చివరి ఎన్నికలా ? ఏమో సదస్సులో పాల్గొన్న బీసీ సామాజికవర్గంలోని ప్రజా ప్రతినిధుల ఉత్సాహం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కేవలం బీసీ ప్రజాప్రతినిధుల కోసమే అధికార వైసీపీ జయహో బీసీ సదస్సు నిర్వహించింది. పంచాయితీల నుండి పార్లమెంటు సభ్యుడివరకు వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ ప్రజాప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సుమారు 85 వేలమంది హాజరయ్యారు.
జగన్ చెప్పినట్లుగానే గతంలో బీసీసంఘాల నేతలను పట్టుకుని చంద్రబాబు తోకలు కత్తిరించేస్తానని బెదిరించారు. సంఘాల నేతలనుపట్టుకుని అందరిముందు చాలా అవమానకరంగా మాట్లాడారు. దాంతోనే బీసీసంఘాల్లో చంద్రబాబంటే తీవ్రవ్యతిరేకత మొదలైంది. అదే సమయంలో బీసీలకు జగన్ పెద్దపీఠ వేయటం మొదలుపెట్టారు. దాంతో మొదటిసారిగా బీసీల్లో మెజారిటి సెక్షన్లు టీడీపీని వదిలిపెట్టేసి జగన్ వెంట నడిచారు. దాని ఫలితంగానే టీడీపీకి ఘోరఓటమి.
ఇపుడు వైసీపీ బీసీ సదస్సును ఎందుకు నిర్వహించిందంటే బీసీల మద్దతును కన్సాలిడేట్ చేసుకోవటం కోసమే. ఇదే సమయంలో ఇంకా టీడీపీకి మద్దతుగా నిలిచిన కొన్ని బీసీ సెక్షన్లను కూడా తనవైపుకు లాగేసుకోవటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. చంద్రబాబుకు తోకలే కాదని కొమ్ములను కూడా లాగేసుకుంటామని బీసీ ప్రతినిధులు గ్రామగ్రామన తిరిగి చెప్పాలని జగన్ కోరారు. బీసీలకు తన శక్తివంచన లేకుండా మేళ్ళు చేస్తున్నాను కాబట్టే వచ్చే ఎన్నికల్లో బీసీలందరు తనకు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నట్లు జగన్ చెప్పారు.
తాను అడిగినట్లే బీసీలకు చేసిన మేళ్ళేంటే చెప్పాలని చంద్రబాబును సూటిగానే ప్రశ్నించారు. వైసీపీ-టీడీపీ హయాంలో బీసీలకు ఎక్కువ మేళ్ళు జరిగాయో ఎవరికి వాళ్ళు బేరీజు వేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. సదస్సులో పాల్గొన్న బీసీ ప్రజాప్రతినిధుల్లో ఆద్యంతం మంచి జోరు కనిపించింది. తాజా సదస్సు విజయవంతమైందని రాబోయే ఎన్నికల్లో కూడా గెలుపు తమదే అని మంత్రులు, వైసీపీ నేతల కాన్ఫిడెన్స్ కనబడుతోంది. సదస్సు నిర్వహణపై ప్రతిపక్షాలు మొదలుపెట్టిన గోలవల్ల సదస్సు విజయవంతమైందని అర్ధమవుతోంది.