ఏదైనా తీసుకోవాలన్నా, మరేదైనా చెల్లించాలన్నా కూడా సిబిల్ స్కొర్ తప్పనిసరి.బ్యాంకు నుంచి రుణాలు పొందాలన్నా ముందుగా సిబిల్‌ ఉండాల్సి ఉంటుంది. హోమ్‌ లోన్‌, పర్సనల్‌ లోన్‌, ఇతర రుణాలు పొందాలని భావించినా సిబిల్‌ స్కోర్‌ ఉంటేనే మీకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి.సిబిల్‌ స్కోర్‌ ఆన్‌లైన్‌లో కొన్ని సంస్థలు అందిస్తుంటాయి. సరసమైన ధరలకు గృహ, వ్యక్తిగత రుణాలను పొందుతున్నప్పుడు మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. రుణం ఇచ్చే బ్యాంకులు లేదా సంస్థలు మీ సిబిల్‌ను తనిఖీ చేస్తాయి. అలాగే మంచి స్కోర్‌ ఉంటే వడ్డీ కూడా తక్కువ పడుతుంది. ఇప్పుడు మీరు వాట్సాప్ యాప్ ద్వారా కూడా మీ సిబిల్ స్కోర్‌ను కూడా ఉచితంగా తెలుసుకోవచ్చు. అన్ని రుణ సంస్థలు మీ క్రెడిట్ చరిత్ర, స్కోర్‌ని తనిఖీ చేయడం ద్వారా మీరు ఏ వడ్డీ, ఎంత రుణం పొందవచ్చో నిర్ణయిస్తాయి.


క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్, డేటాను సేకరిస్తుంది. మీ సిబిల్‌స్కోర్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా తనిఖీ చేయడానికి మిమ్మల్ని అనుమతించే అనేక క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వాట్సాప్ ద్వారా సిబిల్‌ స్కోర్‌ను తెలుసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్ ఇండియా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల చట్టం-2005 కింద లైసెన్స్ పొందిన మొదటి క్రెడిట్ బ్యూరో. ఎక్స్‌పీరియన్ ఇండియా కంపెనీ వాట్సాప్ నుండి ప్రతి ఒక్కరికీ ఈ సదుపాయాన్ని అందిస్తుంది. దీని వల్ల ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. వాట్సాప్‌ ద్వారా సిబిల్‌ తనిఖీ చేయడం వల్ల ఎలాంటి మోసం ఉండదు. ఒక వేళ ఈ సదుపాయంతో ఎలాంటి మోసం జరిగినా పసిగట్టవచ్చు.


ఇకపోతే వాట్సాప్ లో ఈ స్కొర్ పొందడానికి ముందుగా ఎక్స్‌పీరియన్ ఇండియా వాట్సాప్ నంబర్ 9920035444ను మీ ఫోన్‌లో సేవ్ చేయాలి. దీని తర్వాత మీరు ఈ నంబర్‌కు వాట్సాప్‌లో హాల్‌ అని సందేశాన్ని పంపాలి. తర్వాత మీ వివరాలను పంపాలి. వివరాలలో మీరు ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ID, మీ పేరును మాత్రమే పంపాలి. దీని తర్వాత మీరు వాట్సాప్‌లోనే క్రెడిట్ స్కోర్ పొందుతారు. మీరు ఈ క్రెడిట్ నివేదిక పాస్‌వర్డ్ రక్షిత కాపీని కూడా అభ్యర్థించవచ్చు. ఆ కాపీ మీ నెంబర్ కు వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: