జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతో ముచ్చటపడి సినిమా స్టైల్లో చేయించుకున్న వారాహి వెహికల్ చుట్టూ రంగుల వివాదం కమ్ముకుంటోంది. వారాహి వెహికల్ కు మిలిటీ వాహనాలకు వాడే ఆలీవ్ గ్రీన్ రంగు ఎలా వాడుతారని మాజీమంత్రి పేర్నినాని అభ్యంతరం వ్యక్తంచేశారు. మిలిట్రీ వాహనాలకు వాడే ఆలీవ్ గ్రీన్ రంగు ప్రైవేటు వాహనాలకు వాడకూడదన్న విషయం ప్రపంచమేథావుల్లో ఒకడైన పవన్ కు తెలీదా అంటు ఎద్దేవాచేశారు.
ఆలీవ్ గ్రీన్ మిలిట్రీ వాహనాలకు మాత్రమే వాడాలన్న నిబంధన మోటారు వాహనాల చట్టంలోనే ఉందన్నారు. పవన్ కు ఏమైనా సందేహాలుంటే మోటారు వాహనాల చట్టాన్ని చదువుకుంటే తెలుస్తుందన్నారు. యాత్రకోసం సిద్ధం చేసుకుంటున్న వాహనాన్ని అనేక హంగులతో పవన్ రెడీచేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మూడురోజుల క్రితమే ఈ వాహనానికి సంబంధించిన ఇంట్రడక్షన్ ను సినిమా టీజర్ లేదా ట్రైలర్ లాంచింగ్ పద్దతిలో చేశారు. అంత ఆర్భాటంగా రిలీజ్ చేయటంతోనే రంగుల వివాదం పెరిగిపోతోంది.
అప్పటినుండి వారాహి వివాదాల్లో కూరుకుపోతోంది. ఇదే విషయమై నాని మాట్లాడుతు వెంటనే వారాహికి ఆలివ్ గ్రీన్ మిలిట్రీ రంగు తీసేసి పసుపురంగు వేసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ వాహనానికి మిలిట్రీ రంగుకన్నా పసుపు రంగైతేనే బాగా సూట్ అవుతుందని ఎద్దేవా చేయటం గమనార్హం. చంద్రబాబునాయుడు-పవన్ మధ్య ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకునే వారాహికి పసుపురంగు అయితేనే బాగుంటుందని నాని సూచించారు.
మొత్తానికి పవన్ తయారుచేయించుకున్న వాహానం రోడ్డుమీదకు ఎక్కేముందే వివాదాలు స్పీడందుకున్నాయి. చూడబోతే వాహనం రంగులపై వైసీపీ నేతలే ఎవరో ఒకళ్ళు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేట్లున్నారు. అసలు పవన్ యాత్ర ఎప్పుడు మొదలవుతుందో కూడా ఎవరు చెప్పలేకున్నారు. ఇంతోటిదానికి ఇంట్రడక్షన్ బిల్డప్పు మళ్ళీ దాని రంగులపై అభ్యంతరాలు. సరే పవన్ కంటే తన వాహనానికి ఆలీవ్ గ్రీన్ మిలిట్రీ రంగు వేసుకోకూడదని తెలీదు మరి వాహనానికి రిజిస్ట్రేషన్ చేసేటపుడైనా రవాణా శాఖ ఉన్నతాధికారులు చెప్పాలి కదా.