కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను అందిస్తూ వస్తుంది.అసలే కొత్త సంవత్సరం రాబోతోంది. దీంతో ఉద్యోగులకు మూడు గిఫ్ట్ లను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 18 నెలల డీఏ బకాయిల కోసం ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అలాగే.. ఫిట్ మెంట్ పెంపు, డీఏ పెంపుపై కూడా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఈ మూడు డిమాండ్లను కేంద్రం పరిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు డీఏ బకాయిలను కేంద్రం ఇప్పటి వరకు ఉద్యోగులకు చెల్లించలేదు.


డీఏ బకాయిలు 18 నెలల ఒకేసారి ఉద్యోగుల అకౌంట్లలో వేసే అవకాశం ఉంది. కేంద్ర కేబినేట్ ఇంకా డీఏ బకాయిలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే.. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. లేవల్ 3 ఉద్యోగుల డీఏ బకాయిలు కనీసం రూ.11,880 నుంచి రూ.37,554 వరకు వచ్చే అవకాశం ఉంది. లేవల్ 13, లేవల్ 14 ఉద్యోగులకు కనీసం రూ.1,44,200 నుంచి రూ.2,15,900 వరకు డీఏ బకాయిలు వచ్చే అవకాశం ఉంది. అలాగే.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై కూడా కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుందట. వచ్చే కేంద్ర బడ్జెట్ తర్వాత ఫిట్ మెంట్ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.


అయితే..ప్రభుత్వం ఫిట్ మెంట్ ను 3 టైమ్స్ పెంచితే అలవెన్సెలు కాకుండానే ఒక ఉద్యోగి బేసిక్ వేతనం రూ.46,260 కానుంది. ఉద్యోగుల డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుంటే.. 3.68 ఫిట్ మెంట్ ఇస్తే జీతం ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. 3 టైమ్స్ ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెరిగినా కూడా జీతం పెరుగుతుంది. అలాగే.. డీఏ పెంపుపై వచ్చే మార్చిలో కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం రేట్లను పరిగణనలోకి తీసుకొని 3 నుంచి 5 శాతం డీఏను కేంద్రం పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 4 శాతం డీఏను 28 సెప్టెంబర్ 2022న పెంచిన సంగతి తెలిసిందే..త్వరలోనే మరో గుడ్ న్యూస్ చెప్పనుంది...


మరింత సమాచారం తెలుసుకోండి: