అప్పుడెప్పుడో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పిన పార్టీ లేదు బొక్కాలేదు అన్నమాట గుర్తుందా ? దాదాపు ఆమాటను చంద్రబాబునాయుడు అంగీకరించారు. పార్టీ పరిస్ధితిపై చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా, జనాల్లో ఎంతగా తిరుగుతున్నా పెద్దగా ఫలితం కనబడటంలేదన్న ఆందోళన బాగా పెరిగిపోతోంది. పార్టీ నేతల సమావేశంలో ఇదే విషయమై చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. ఆందోళన వ్యక్తంచేయటమే కాకుండా పార్టీ ఆఫీసుకొచ్చి కష్టపడిపోతున్నట్లు బిల్డప్పులివ్వటమే కాకుండా బలప్రదర్శన చేస్తున్నారంటు మండిపోయారు.
పార్టీలోని సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతు పార్టీ పరిస్ధితి రోజురోజుకు నిర్వీర్యమైపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నిసార్లు చెప్పినా నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయటంలేదంటు మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షేత్రస్ధాయిలో పోరాటాలు చేయకుండా ఇక్కడకొచ్చి బలప్రదర్శన చేస్తారా అంటు నిలదీశారు. నేతల యాటిట్యూడ్ మార్చుకోకపోతే పార్టీకి భవిష్యత్తు కష్టమని పరోక్షంగా చెప్పేశారు.
చంద్రబాబు స్వయంగా నేతలకు క్లాసుపీకిన వీడియో బిట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదో ఎల్లోమీడియా మద్దతుంది కాబట్టి చంద్రబాబు అండ్ కో నెట్టుకొచ్చేస్తోంది. ఎల్లోమీడియా మద్దతే లేకపోతే అసలు చంద్రబాబు, టీడీపీని జనాలు ఎప్పుడో మర్చిపోయేవారేమో. ఎల్లోమీడియా కూడా చంద్రబాబుకి ఎందుకింత మద్దతుగా నిలబడుతోంది ? ఎందుకంటే తన అవసరాలు కేవలం తనవసరాల కోసమే అని అందరికీ తెలుసు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే చంద్రబాబుకు ప్రత్యేకంగా జరగబోయే నష్టమంటు ఏమీలేదు. మహా అయితే ఏదో కేసులో విచారణ పేరుతో చంద్రబాబును కోర్టులో నిలబెడతారేమో అంతే.
కానీ ఇదేసమయంలో ఎల్లోమీడియాకు మాత్రం తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. జగన్ మీద ఎల్లోమీడియా చల్లాల్సిన బురదంతా ఇప్పటికే చల్లేసింది. కొత్తగా చల్లటానికి ఏమీలేకే పాచిపోయిన కథనాలు, వార్తలను మళ్ళీ ఫ్రెష్ అనేట్లుగా తిరిగి అచ్చేసుకుంటోంది. ఈ కారణంగానే చాలామంది జనాలు ఎల్లోమీడియాను నమ్మటంలేదు. దీనికితోడు జగన్ రెండోసారి అధికారంలోకి వస్తే పాపం ఎల్లోమీడియా బాధ వర్ణణాతీతం. అందుకనే ఆ భయంతోనే ఎలాగైనా జగన్ను అధికారంలోకి రానీయకుండా చేయాలని పదేపదే చంద్రబాబును హైలైట్ చేస్తోంది. కానీ క్షేత్రస్ధాయిలో జాకీలతో ప్రయత్నాలు చేస్తున్నా టీడీపీ లేవటంలేదు. ఆ ఫ్రస్ట్రేషనే సీనియర్లపై చంద్రబాబు చూపింది.