మన ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ చాలా ముఖ్యమైనది.. వాహనదారులు లైసెన్స్ లేకుండా బయటకు వెళితే ఇక అంతే సంగతే.. ఒకటి భారీ ఫైన్ పడుతుంది లేదా జైలుకు వెళ్ళక తప్పదు. డ్రైవింగ్ చేయాలంటే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉండాలి. అయితే చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ తమ వద్ద ఉంచుకోవడం మర్చిపోతుంటారు. దాంతో పోలీసులు చెకింగ్ సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ అడితే బిత్తర చూపులు చూడాల్సిన పరిస్థితి వస్తుంది.
అయితే, ప్రస్తుతం ఈ విషయంలో చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు మీ డ్రైవింగ్ లెసెన్స్‌ను ఇంట్లో మర్చిపోయినా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఫోన్‌లో సెకన్ల వ్యవధిలోనే డ్రైవింగ్ లైసెన్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇండియాలో గేర్, ఫోర్ వీలర్ లేదా పెద్ద వాహనాన్ని నడపడానికి కనీసం 18 ఏళ్ల వయస్సు ఉండాలి. అలా అయితే డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది..
ఇక మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను మీ పర్సులో ఉంచుకున్నట్లే, అందుకు సంబంధించిన పీడీఎఫ్‌ను కూడా మీ మొబైల్‌లో ఉంచుకోవచ్చు. దీనిని ఆన్‌లైన్ ద్వారా ఈజీగా డౌన్‌లోడ్ చూసుకోవచ్చు.. డైరెక్ట్ గా కార్డు లేనివాల్లు ఇలా కూడా డౌన్ లోడ్ చేసుకొవచ్చు.. పోలీసులు అనుమతిస్తారు.
*. ముందుగా రవాణా సేవల వెబ్‌సైట్‌కు వెళ్ళాలి..
*. ఆన్‌లైన్ సేవలు విభాగంలో డ్రైవర్ లైసెన్స్-సంబంధిత సేవలు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
*. డ్రాప్-డౌన్ మెను నుండి రాష్ట్ర పేరును ఎంచుకోవాలి.
*. డ్రైవింగ్ లైసెన్స్ విభాగంలో 'ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్' పై క్లిక్ చేయండి.
*. మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
*. ఆ తరువాత సబ్మిట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను చెక్ చేసిన తరువాత.. మీ లైసెన్స్‌ను ప్రింట్ తీసుకోవచ్చు..
*. ముందుగా డిజిలాకర్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చెయ్యాలి.. మీ అకౌంట్‌కు లాగిన్ ఇవ్వాలి.
*. ఎగువ ఎడమ మూలలో 'సెర్చ్ డాక్యూమెంట్స్' లింక్‌ను క్లిక్ చేయండి.
*. మెనులో 'డ్రైవింగ్ లైసెన్స్' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
*. మీ 'డ్రైవింగ్ లైసెన్స్ నంబర్' ఎంటర్ చేసి, 'గెట్ ద డాక్యుమెంట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అంతే డ్రైవింగ్ లైసెన్స్ సులువుగా పొందొచ్చు..