ఇపుడీ విషయమే ఎవరికీ అర్ధంకాకుండా ఉంది. సమాజంలో మేజర్ సెక్షన్ అయిన బీసీల విషయంలో రాజకీయపార్టీలకు ఒక క్లారిటి ఉంది. మొన్నటి ఎన్నికలనే తీసుకుంటే బీసీల్లో మేజర్ సెక్షన్ వైసీపీకి మద్దతుగా నిలబడింది. దానివల్లే వైసీపీకి అఖండవిజయం సాధ్యమైంది. బీసీల్లోనే ఇంకాకొన్ని వర్గాలు టీడీపీతోనే ఉండబట్టి కనీసం 23 సీట్లయినా దక్కింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీసీలు తమతోనే ఉంటారని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ఇదే సమయంలో బీసీలను జగన్ మోసంచేస్తున్న కారణంగా మళ్ళీ టీడీపీ వైపుకే వచ్చేస్తారని చంద్రబాబునాయుడు కూడా గట్టిగా అనుకుంటున్నారు.





బీసీలుంటే పై రెండు పార్టీల మధ్యే ఉండే అవకాశముంది. బడుగు, బలహీనవర్గాలంటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పడికట్టు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి బీసీలు జనసేనకు మద్దతిచ్చే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే చాలా జిల్లాల్లో కాపు-బీసీలకు ఏమాత్రం పడదు. కాబట్టి బీసీల విషయంలో ఒక క్లారిటి ఉంది. మరి కాపుల విషయంలోనే క్లారిటి రావటంలేదు. ఎందుకంటే కాపుల ఓట్లకోసం వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నాయి.





జనాభాలో 19 శాతం ఉన్న కాపులు ఏ ఒక్కపార్టీకో మద్దతుదారులుగా ఎప్పుడూ నిలబడలేదు. ప్రముఖ కాపునేతలు అన్నీపార్టీల్లోను ఉన్నారు. దాంతో వచ్చేఎన్నికల్లో కాపుల మద్దతు ఎవరికి అనే విషయంలో బాగా అయోమయం పెరిగిపోతోంది. పవన్ స్వయంగా కాపు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మెజారిటి కాపుల మద్దతు తనకే ఉంటుందని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే తన అన్న మెగాస్టార్ చిరంజీవిని పరోక్షంగా రంగంలోకి దింపుతున్నారు.





బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కూడా కాపు నాయకుడే. కాబట్టి కాపుల్లో ఎక్కువమంది బీజేపీకే మద్దతుగా నిలుస్తారని ఆయన అనుకుంటున్నారు. అయితే అందుకు అవకాశాలు తక్కువని ఆయనకీ తెలుసు. ఇక వైసీపీ, టీడీపీల్లో ఏ పార్టీ కాపులకు ఎక్కువ సీట్లిస్తుందో ఆ పార్టీవైపే కాపులు మొగ్గుచూపుతారనే చర్చ పెరిగిపోతోంది. ఈ లెక్క ప్రకారమైతే ఇప్పుడు వైసీపీలోనే కాపు ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎక్కువగా ఉన్నారు. అయినా కాపుల మద్దతు వైసీపీకే ఉంటుందని చెప్పలేకపోతున్నారు. ఇందుకనే వచ్చేఎన్నికల్లో ఏపార్టీని ‘కాపు’ కాస్తారో అర్ధంకావటంలేదు.





మరింత సమాచారం తెలుసుకోండి: