ఇంతకాలానికి జనసేన పార్టీ ఫుల్లు హ్యాపీగా ఫీలయ్యుంటుంది. కారణం ఏమిటంటే ఒక గట్టినేత పార్టీలో చేరారుకాబట్టే. అదికూడా వైసీపీ నుండి జనసేనలో చేరటమంటే మామూలు విషయంకాదు. ఇంతకీ విషయం ఏమిటంటే తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నేత బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరారు. ఇప్పటివరకు జనసేనలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తర్వాత చెప్పుకోదగ్గ నేతలే లేరు.





పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళవుతున్నా ఇంతవరకు చెప్పుకోదగ్గ నేతలే పార్టీలో చేరలేదంటే జనసేన పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి మరోవైపు టార్చిలైటు వేసి వెతికినా చెప్పుకోదగ్గ నేతలు కనబడటంలేదు. ఈ నేపధ్యంలో బొంతు జనసేనలో చేరటమంటే చిన్న విషయంకాదు. నిజానికి బొంతు వైసీపీలో అసంతృప్తిగా అయితే లేరు. కాకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కేది అనుమానమే.






వచ్చేఎన్నికల్లో పోటీచేయటం కోసమే బొంతు జనసేనలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీ సభ్యుడిగానే ఐడెంటిఫై అవుతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా రాపాకకే టికెట్ దక్కుతుందని అనుకుంటున్నారు. ఈ కారణంగానే బొంతు పార్టీమారి టికెట్ తెచ్చుకుని చిరకాల ప్రత్యర్ధి రాపాకను ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. 2014,19 ఎన్నికల్లో బొంతు వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. రెండుసార్లు వరసగా ఓడిపోయిన కారణంగా ఈయనకు టికెట్ దక్కే అవకాశాలు దాదాపు లేవనేచెప్పాలి. ఇందుకనే బొంతును జగన్మోహన్ రెడ్డి పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి సలహాదారుగా నియమించారు.





వచ్చేఎన్నికల్లో పొత్తుల సంగతి పక్కనపెట్టేస్తే వైసీపీ తరపున రాపాక, జనసేన తరపున బొంతు, టీడీపీ తరపున గొల్లపల్లి పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు వరుస ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినా రాజోలులో బొంతుకు గట్టి నేతగానే పేరుంది. అందుకనే టికెట్ హామీతోనే బొంతు జనసేనలో చేరారు. నిజానికి దాదాపు మూడునెలల క్రితమే కొడుకుతో కలిసి బొంతు నేరుగా పవన్ను కలిసినా అధికారికంగా జాయిన్ అవ్వటానికి ఇన్నిరోజులు ఎందుకు పట్టిందో అర్ధంకావటంలేదు.





మరింత సమాచారం తెలుసుకోండి: