ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మామూలు జనాలకు కాదు చివరకు తమ్ముళ్ళకి కూడా పిచ్చెక్కించేస్తున్నారు. వచ్చేఎన్నికలకు సంబంధించి ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల జనాలతో పాటు నేతలు కూడా అయోమయంలో పడిపోతున్నారు. ఒకసారి జమిలి ఎన్నికలు ఖాయమంటారు. మరోసారి ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయని చెబుతారు. ఒకసారి అయితే ముందస్తు ఎన్నికలకు ముహూర్తం కూడా పెట్టేశారు. మరోసారి ఎన్నికలు ఏరోజైనా వచ్చేయచ్చంటారు.





చంద్రబాబు దృష్టిలో ఎన్నికలు జమిలిగా జరుగుతాయా ? లేకపోతే ముందస్తు ఎన్నికలు జరుగుతాయా ? అదీకాకపోతే ఏ రోజైనా ఎన్నికలు జరుగుతాయని చెప్పటం వాస్తవమేనా ? మామూలుగా అయితే ఎవరైనా మూడు విధాలుగా మాట్లాడితే మిగిలిన జనాలు పిచ్చోడనే అంటారు. ఒకే వ్యక్తి మూడు విధాలుగా మాట్లాడితే మెంటలెక్కిందా అని అడుగుతారు. మరిక్కడ మాట్లాడుతున్నది స్వయంగా చంద్రబాబే. కాబట్టి డైరెక్టుగా ఎవరు చంద్రబాబును మెంటలెక్కిందా అని అడగలేకపోతున్నారు.





నిజానికి అప్పుడెప్పుడో జమిలి ఎన్నికల మీద నరేంద్రమోడీ చాలా ఇంట్రస్టు చూపించారు. అయితే అది మోడీ ఒక్కళ్ళనుకుంటే సాధ్యంకాదు. లోక్ సభను రద్దుచేయటం మోడీ ఇష్టమనే అనుకున్నా అసెంబ్లీలు కూడా రద్దయినపుడే జమిలి ఎన్నికలు సాధ్యమవుతాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మోడీ చెప్పినట్లు వింటారనరటంలో సందేహంలేదు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు మోడీ మాట వినే అవకాశాలు దాదాపు లేవు.





ఇక ముందస్తు ఎన్నికలు అవసరమే లేదని ప్రభుత్వం తరపున ఇప్పటికే క్లారిఫికేషన్ వచ్చేసింది. ప్రభుత్వం ఇంతస్పష్టంగా చెప్పినా చంద్రబాబు పదేపదే ముందస్తు ఎన్నికలని అంటున్నారంటే కేవలం డ్రామా అనే అనుమానించాలి. నేతల్లో జోష్ నింపేందుకు, పార్టని వదిలి తమ్ముళ్ళు వెళ్ళిపోకుండా ఉండటం కోసమే చంద్రబాబు ముందస్తు జపం చేస్తున్నారని అనుమానం పెరిగిపోతోంది. ఇందుకనే చంద్రబాబు మానసిక పరిస్ధితి పైనే మంత్రులు, వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయమై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని దుమ్ము దులిపేస్తున్నారు. అయినా చంద్రబాబు పద్దతి మాత్రం మారటంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: