ఏపీకి మరో వర్ష సూచన..గతంలో కురిసిన వర్షాలకు రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు.. ఇప్పటికీ భారీ వర్షాలు వదలకుండా కురుస్తున్నాయి.. ఏపీ, యానాంల లో వర్షాలు రెండు రొజులకు ఒకసారి కురుస్తున్నాయి. ఇప్పుడు మరొకసారి భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు సూచించారు.. నైరుతి బంగాళాఖాతం లో కొనసాగుతోన్న ఉపరితల ద్రోణి బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనం గా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం వాయుగుండంగా బలపడిందని తెలిపింది.


అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు పయనించే అవకాశం ఉందని ఐఎండీ ఓ నివేదికలో పేర్కొంది. ఈ ద్రోణీ కారణంగా రానున్న మూడు రోజుల్లో తమిళనాడు లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొంది.మరోవైపు రాష్ట్రం పైకి ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో పొగమంచు కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్షీణిస్తుండడం తో చలి ప్రభావం అధికంగా ఉంటోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యల్పం గా అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకు లోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. గురు, శుక్రవారా ల్లో రాష్ట్రంలో పొడి వాతావరణ నెలకొంటుందని ఐఎండీ పేర్కొంది.


అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై దీని ప్రభావం నామమాత్రంగా ఉండనుందని చెప్పారు. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమల లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉత్తర కోస్తాంద్ర లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ఏపీవ్యాప్తంగా ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తుండటం తో.. రాష్ట్ర మంతటా దట్టమైన పొగమంచు, చలి ప్రభావం పెరుగుతోంది..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: