కరోనా మిగిల్చిన పరిస్థితుల కారణంగా రైతుల పరిస్థితి దారుణంగా మారింది...పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి దాపురించింది. అయితే ఇప్పుడు కొందరు లోన్ తీసుకొని పంటలు పండించాలని భావిస్తున్నారు.. దాంతో కొందరు బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి పోతున్నారు.. అలాంటి వారికి గుడ్ న్యూస్.. కేవలం ఒక్క మిస్డ్ కాల్ తో ఇంట్లో కూర్చోనే లోన్ ను పొందవచ్చు..అదెలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...


రైతులకు వ్యవసాయ పరికరాలు, విత్తనాలు కొనుగోలు చెసెందుకు ప్రభుత్వాలు రైతులకు భారీ సబ్సిడీ ఇస్తున్నాయి. ప్రభుత్వాలతోపాటు చాలా బ్యాంకులు కూడా రైతులను ఆదుకునేందుకు వస్తున్నాయి.. ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా లోన్ లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది.తాజాగా రైతులకు ఒక గుడ్ న్యూస్ ను చెప్పింది..బ్యాంకుల చుట్టూ తిరగకుండా కేవలం మీ ఫోన్ తో ఒక మిస్డ్ ఇస్తే సరిపోతుందని చెబుతుంది..ఎటువంటి విధంగా లోన్ పొందాలో చూద్దాం..


పీఎన్‌బీ బ్యాంకు రైతులకు తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాన్ని అందజేస్తోంది. దాంతో పాటు కొన్ని బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తున్నాయి. దీని కోసం, కొన్ని షరతుల ఆధారంగా రుణం ఇవ్వబడుతుంది.. ఈ రుణాన్ని ఎలా పొందాలంటే..ఈ రుణం కింద దరఖాస్తు చేయవలసి వస్తే, మీరు రుణం తీసుకోవడానికి చాలా సులభమైన మార్గాలున్నాయి. రుణం తీసుకోవాలంటే మాత్రం క్రింది వాటిని ఫాలో అవ్వాల్సిందే..


ముందుగా మీ ఫోన్ నుంచి 56070కి 'లోన్' అని SMS చేయండి
18001805555 కు మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా..
కాల్ సెంటర్‌ను 18001802222లో సంప్రదించండి
నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ netpnb.com ద్వారా దరఖాస్తు చేసుకోండి.. PNB One ద్వారా దరఖాస్తు చేసుకోండి..అంతే మీకు లోన్ ఎమౌంట్ మీ అకౌంట్ లోకి వస్తుంది..లోన్ పొందాలని అనుకుంటే మీరు కూడా ట్రై చెయ్యండి..


మరింత సమాచారం తెలుసుకోండి: