రైతులు దేశానికి వెన్నెముక..వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ ఆసరగా నిలుస్తున్నారు ప్రభుత్వాలు..అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాల ద్వారా రైతులకు అండగా నిపుస్తున్నారు.వారి వార్షిక ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది..అందులో భాగంగ పీఎం కిసాన్ యోజన పథకాన్ని అందిస్తున్నారు..



ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తోంది మోదీ ప్రభుత్వం. అయితే మరో అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో రూ.2 వేలు కాదు ఏకంగా రూ.15 లక్షలను ఇస్తోంది.ఈ  పథకం లబ్ధిదారులకు ప్రయోజనకరంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వం మరోసారి రైతులకు పెద్దపీట వేస్తోంది. ఈసారి రైతులు భారీ మొత్తాన్ని అందుకోబోతున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి మరో పెద్ద అడుగు వేసింది. నిజానికి ఈ పథకం ద్వారా రూ.6వేలు ఇస్తుండగా, ఇప్పుడు కొత్తగా వ్యవసాయ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.


ఎలా అప్లై చేసుకోవాలంటే..



నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఇక్కడ FPO ఎంపికపై క్లిక్ చేయండి. దీని తర్వాత ‘రిజిస్ట్రేషన్’ ఎంపికకు వెళ్లండి.ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో కోరిన సమాచారాన్ని పూరించండి.ఇప్పుడు పాస్‌బుక్ లేదా రద్దు చేయబడిన చెక్కు, ID రుజువును స్కాన్ చేసి సమర్పించాలి..

పథకం కింద, రైతులకు భారీ ప్రయోజనాలు లభిస్తాయి. దాంతో రైతు సోదరులు సులభంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. ఈ పథకం ద్వారా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు ప్రభుత్వం రూ.15 లక్షలు ఇస్తుంది.దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి 11 మంది రైతులు కలిసి ఒక సంస్థ లేదా కంపెనీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ దశతో, వ్యవసాయ సంబంధిత పరికరాలు లేదా ఎరువులు, విత్తనాలు లేదా మందులను కొనుగోలు చేయడంలో సౌలభ్యం ఉంటుంది..మీరు కూడా ఆ పథకం ద్వారా లబ్ది పొందాలంటే మాత్రం అప్లై చెయ్యండి..

మరింత సమాచారం తెలుసుకోండి: