అందులో భాగంగా చంద్రబాబు కొత్త సంవత్సరంలో తన సొంత నియోజకవర్గం అయిన చిత్తూరు జిల్లాలోని కుప్పంకు వెళ్లనున్నారు. చంద్రబాబు పిఎ అందించిన సమాచారం ప్రకారం. బెంగళూర్ నుండి 4 వ తేదీన చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కుప్పం కు వస్తారట. వరుసగా 7 సార్లు కుప్పం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచిన చంద్రబాబుకు ఈసారి మాత్రం కష్టంగా మారే అవకాశం ఉంది. కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ని ఓడించి వైసీపీ విజయకేతనం ఎగుర వేసింది. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి గా ఉన్న భరత్ చంద్రబాబు కు ప్రత్యర్థిగా మారి ఎన్నికల్లో ఢీ కొట్టనున్నారు.
భరత్ ఇంఛార్జి గా క్షేత్రస్థాయిలో ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చి వైసీపీని బలోపేతం చేస్తున్నారు. కాగా ఈ రోజుతో నెల్లూరు జిల్లాలో చంద్రబాబు చేస్తున్న పర్యటన పూర్తి కానుంది. మరి చూద్దాం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు వరుసగా ఎనిమిదవసారి ఎన్నికల్లో గెలిచి రికార్డును మరింత పెంచుకుంటాడా లేదా స్థానిక ఎన్నికల లాగే వైసీపీ చేతిలో ఓడిపోతారా అన్నది తెలియాల్సి ఉంది.