రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో ఏదోరూపంలో చక్రంతిప్పాలని చంద్రబాబునాయుడు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ ఆధ్వర్యంలో  ఖమ్మంలో ఈమధ్యనే బహిరంగసభ జరిగింది. బహిరంగసభ నిర్వహణ వెనుక అనేక కతలు వినిపిస్తున్నా అవన్నీ కూడా బీజేపీని లొంగదీసుకోవటం కోసమే అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అదేమిటంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తామని కలలుకంటోంది. అయితే ఆ పార్టీకి అంత సీనుందా అనేది కీలకమైన ప్రశ్న.





ఇక్కడే చంద్రబాబు ఒక వ్యూహం పన్నారు. అదేమిటంటే తెలంగాణాలో బీజేపీకి టీడీపీ సాయం చేసేట్లు, దానికి ప్రతిగా ఏపీలో టీడీపీకి బీజేపీ పొత్తు పెట్టుకునేట్లు. ఇదంగా కేవలం చంద్రబాబు యాంగిల్లో మాత్రమేనండోయ్. బీజేపీ ఆలోచనలు ఎలాగున్నాయో ఎవరికీ తెలీదు. తెలంగాణాలో తన బలం తగ్గలేదని నిరూపించుకుని లొంగదీసుకునేందుకే ఖమ్మంలో టీడీపీ సభ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో తమతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే తెలంగాణాలో టీడీపీ ఓట్లన్నీ బీజేపీకి వేయించి అధికారంలోకి వచ్చేందుకు సాయం చేస్తామని తమ్ముళ్ళ ప్రతిపాదన.





తెలంగాణాలో నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయినా క్యాడర్ చెక్కుచెదరలేదని, అలాగే ఓటర్లు ఇంకా ఉన్నారని చాటిచెప్పటమే చంద్రబాబు ఉద్దేశ్యం. టీడీపీ ఓట్లను బూచిగా చూపించి బీజేపీతో పొత్తుపెట్టుకుంటే తర్వాత ఏపీలో కూడా పొత్తు కంటిన్యు చేయాలన్నది అసలు ప్లాన్. అయితే చంద్రబాబు ప్లాన్ పై బండి సంజయ్  పెద్ద బండేశారు. టీడీపీతో ఎప్పటికీ పొత్తుండదని స్పష్టంగా ప్రకటించేశారు.





టీడీపీ, బీజేపీ పొత్తుంటుందని జరుగుతున్న ప్రచారమంతా అబద్ధాలేనని బండి స్పష్టంచేశారు. రెండుపార్టీల మధ్య పొత్తుండదన్న విషయాన్ని నేతలు, క్యాడర్ జనాలందరికీ వివరించాలని కూడా బండి అన్నారు. పొత్తు విషయమై క్లారిటి ఇవ్వాలని విజయశాంతి చేసిన సూచన ప్రకారమే విస్తారక్ సమావేశంలో పొత్తుండదన్న విషయాన్ని బండి  ప్రకటించారు. ఎన్నికల ముందు ఏమి జరుగుతుంది అన్న విషయం ఇపుడే చెప్పలేకపోయినా ఇప్పటికైతే చంద్రబాబు ఆశలపై బండి పెద్ద బండేసినట్లే అనుకోవాలి. ఇలాంటి బండే గతంలో జనసేనతో పొత్తు విషయంలో కూడా వేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: