ప్రతి నెలలో బ్యాంకులకు సెలవులు ఉంటాయన్న సంగతి తెలిసిందే..బ్యాంకులతో కొన్ని ముఖ్యమైన పనులను చెయ్యాల్సిన వారు ముందే వాటిని చేసుకోవడం మంచిది..ప్రతి నెల ఆర్బీఐ బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. బ్యాంకు కస్టమర్లు పనులను చేసుకునేందుకు ముందస్తు ప్లాన్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే సమయం వృధా కావడమే కాకుండా నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది...ఈ ఏడాదిలో కూడా జనవరి లో 15 రోజులు సెలవులు వున్నట్లు తెలుస్తోంది.


ఈ నెలలో వున్న సెలవులు ఏవో ఒకసారి చుద్దాము...
జనవరి 1 - న్యూ ఇయర్‌తో పాటు ఆదివారం ఉన్నందున కామన్‌గా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
జనవరి 2 - మిజోరంలో కొత్త సంవత్సరం సెలవు, మిజోరంలో బ్యాంకులకు సెలవు.
జనవరి 8 - ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
జనవరి 11 - మిజోరంలో మిషనరీ డే, మిజోరంలో బ్యాంకులు క్లోజ్
జనవరి 12 - స్వామి వివేకానంద జయంతి. పశ్చిమ్ బంగాలో ఈ రోజును బ్యాంకులు బంద్ ఉంటాయి.
జనవరి 14 - మకర సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కర్ణాటక, అసోం, సిక్కింలో బ్యాంకులు ఉండవు..
జనవరి 15- ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
జనవరి 16- కనుమ పండగ- ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు, ఉళవర్ తిరునైల్ పుదుచ్చేరి, తమిళనాడులో బ్యాంకులు బంద్.
జనవరి 22- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
జనవరి 23- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. అసోంలో బ్యాంకులు బంద్.
జనవరి 25- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అక్కడ మాత్రమే బ్యాంకులు బంద్‌ ఉంటాయి.
జనవరి 26- రిపబ్లిక్ డే, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
జనవరి 28- నాలుగో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.
జనవరి 29- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
జనవరి 31- మీ - డ్యామ్ -మీ-ఫై అసోంలో బ్యాంకులు పనిచెయ్యవు..ఈరోజుల్లో బ్యాంక్స్ పని చెయ్యవు ఏదైనా వుంటే ముందే చేసుకోవడం మంచిది..


మరింత సమాచారం తెలుసుకోండి: