అయితే ఈ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున అప్పులు చేశాడన్న అపవాదు కూడా జగన్ పైన ఉంది. ఇదిలా ఉంటే తాజాగా చంద్రబాబు కండక్ట్ చేసిన కందుకూరు మరియు గుంటూరు సభలలో అపశ్రుతి చోటు చేసుకుని మొత్తం 11 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ విషయం పట్ల ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. చంద్రబాబు ను వయసును ప్రస్తావిస్తూ ఏకిపారేశాడు. అంతే కాకుండా చంద్రబాబు, జగన్ మరియు కేసీఆర్ లకు పాలన చేత కాదని వీరుంటే అభివృద్ధి జరగదని వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతికి ఓటు వేయాలని చెబుతూ , ఈ క్షణం రెండు రాష్ట్రాలను నాకు అప్పగిస్తే రెండు రాష్ట్రాలకు ఉన్న లక్షల కోట్ల అప్పును తీర్చివేయడమే కాకుండా, కంపెనీలను రాష్ట్రాలకు తీసుకువచ్చి అభివృద్ధిని చేస్తానని ఘంటాపధంగా చెప్పాడు.
అయితే కే ఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ కె ఏ పాల్ అంత సత్తా ఉన్న వ్యక్తి అని చెప్పాలి. అంటరాజాతీయంగా ఆయనకున్న పలుకుబడి వలన లక్షల కోట్లు ఇవ్వడానికి మరియు వందల కంపెనీలు తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉంటారు. మరి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇవన్నీ జరగడం అసాధ్యం అని సామాన్యుడు ఆలోచిస్తున్నాడు. కానీ అందరిలాగే కే ఏ పాల్ కు కూడా ఒక అవకాశం ఇస్తే ఏమి చేస్తాడు అన్నది తెలిసిపోతుంది అంటూ మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.