ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీకి ఘోరపరాజయం తప్పదని జగన్మోహన్ రెడ్డికి సర్వే రిపోర్టు వచ్చినట్లుందని ఎంపీ అనుమానం వ్యక్తంచేశారు. ఆ రిపోర్టు కారణంగానే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళకూడదని డిసైడ్ అయినట్లు ఎంపీ ఎద్దేవాచేశారు. ఏపీ పోలీసుప్రభుత్వం పతనం అంచుల్లో ఉందన్నారు.
చంద్రబాబునాయుడుతో పవన్ కల్యాణ్ భేటీ కాగానే తమపార్టీ నేతల ప్యాంట్లు తడిసిపోయినట్లు ఎగతాళిగా మాట్లాడారు. పవన్ ఒక సినిమాలో నటిస్తే రు. 100 కోట్లు వచ్చేటపుడు తనకు అడుక్కునే ఖర్మ ఎందుకని ప్రశ్నించారు. పవన్ను కాపు సామాజికవర్గానికి మాత్రమే పరిమితం చేయాలని తమపార్టీ ప్రయత్నిస్తోందని ఎంపీ మండిపడ్డారు. సరే ఎంపీ మాటలను జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి మాటలు మాట్లాడుతున్న కారణంగానే రాజుగారు ఢిల్లీ వదిలి రాష్ట్రంలోకి అడుగుపెట్టలేకపోతున్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని అనేందుకు ఎంపీ దగ్గరున్న ఆధారమేమిటి ? ఆయనేమన్నా సర్వే చేయించారా ? ఓటమి భయంతోనే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం లేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇంతకుముందంతా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని చెప్పింది వీళ్ళే. ఇపుడు ఓటమిభయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం లేదని చెబుతున్నదీ వీళ్ళే. చంద్రబాబు-పవన్ భేటీతో వైసీపీ నేతల్లో ప్యాంట్లు తడిచిపోవటం ఏమిటో ఎంపీకే తెలియాలి.
జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ప్యాంట్లు తడిసిపోవటం వల్ల ఇద్దరు ఏకకావాలని నానా అవస్తలు పడుతున్నారు. రెండుపార్టీలు దేనికదే పోటీచేస్తే జగన్ చేతిలో చావుదెబ్బ తప్పదని చంద్రబాబు, పవన్ కు బాగా అర్ధమైంది. అందుకనే ఇద్దరు పొత్తుపెట్టుకునే విషయమై మల్లగుల్లాలు పడుతున్నది వాస్తవం. ఇక పవన్ సినిమాకు రు. 100 కోట్లు తీసుకుంటున్నది నిజమేనా ? అలాగే పవన్ను కాపు సామాజికవర్గానికే పరిమితం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందని చెప్పటం తప్పు. ఎందుకంటే కాపు సామాజికవర్గంలో చాలామంది పవన్ను వ్యతిరేకిస్తున్నారు. అంటే సొంత సామాజికవర్గం కూడా పవన్ను పూర్తిగా ఓన్ చేసుకోవటంలేదని ఎంపీకి తెలీదేమో.