ఇంతజరిగినా తెలుగుదేశంపార్టీకి ఇంకా బుద్ధిరాలేదు. చంద్రబాబునాయుడు రెండు కార్యక్రమాల్లో నాలుగురోజుల వ్యవధిలో ఆమధ్య 11 మంది చనిపోయారు. కందుకూరు రోడ్డుసభలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారు. తర్వాత గుంటూరులో కానుకుల పేరుతో బహిరంగసభ నిర్వహించినపుడు జరిగిన తొక్కిసలాటలో మరో ముగ్గురు చనిపోయారు. అయినా టీడీపీకి బుద్ధిరాలేదు. దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే కుప్పంలో లోకేష్ పాదయాత్రే. పాదయాత్ర సందర్భంగా జరిగిన ర్యాలీ తొక్కిసలాట ఏకంగా నందమూరి తారకరత్న ప్రాణాలమీదకు తెచ్చింది.





పాదయాత్ర సందర్భంగా పట్టణంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి లోకేష్ యాత్రను మొదలుపెట్టారు. దేవాలయం నుండి మసీదు వరకు జరిగిన యాత్రలో నేతలు, కార్యకర్తలను  భారీగా తరలించారు. ఈ రోడ్డు చాలా ఇరుగ్గా ఉండటంతో ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. లోకేష్ వెనక నడుస్తున్న నందమూరి తారకరత్న తొక్కిసలాటలో ఇరుక్కుపోయి తట్టుకోలేక సొమ్ముసిల్లి పడిపోయారు. దాంతో వెంటనే తారకరత్నను ఆసుపత్రికి తరలించారు.





దేవాలయం నుండి మసీదు వరకున్న రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుంది. ఇంత ఇరుకైన రోడ్డులో అంతమంది జనాలతో లోకేష్ పాదయాత్రను మొదలుపెట్టడమే తప్పు.  సెంటిమెంటు ప్రకారం ఆ రోడ్డలో పాదయాత్రను మొదలుపెట్టినా జనాలను అంతమందిని పోగేసుండకూడదు. పాదయాత్ర మొదలుపెట్టేటపుడు ఇరుకురోడ్డులో వెళ్ళకూడదన్న కనీస ఇంగితం కూడా లేకుండా మొదలుపెట్టేశారు. దాంతో ఇపుడు తారకరత్న ప్రాణాలమీదకు వచ్చేసింది.





రోడ్డుమీద పడిపోయిన తారకరత్నను కారులో ఆసుపత్రికి చేర్చేసమయానికి కార్డియాక్ అరెస్టయి, పల్స్ ఆగిపోయింది. డాక్టర్లు నానా అవస్తలు పడిన 45 నిముషాల తర్వాత మళ్ళీ  పల్స్ మొదలైంది. ఈలోగానే శరీరమంతా బ్లూ కలర్లోకి మారిపోయి మరణం అంచుల్లోకి జారిపోయారు. అత్యవసర చికిత్స నిమ్మితం తారకరత్నను కుప్పం నుండి బెంగుళూరుకి మార్చినా ఇంకా ప్రమాదం అంచునే ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ప్రాణాపాయ స్ధితిలో ఉన్నది తారకరత్నా లేకపోతే మరొకళ్ళా అన్నది కాదు ప్రశ్న. ఇరుకురోడ్లలో ర్యాలీలు, రోడ్డుషోలు ఎందుకన్నదే పాయింట్. ఇలాంటివి జరక్కుండానే కదా ప్రభుత్వం జీవో 1 జారీచేసింది.




మరింత సమాచారం తెలుసుకోండి: