జగన్మోహన్ రెడ్డి తక్షణమే దృష్టిపెట్టాల్సిన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏమిటంటే ఎన్నికలకు ఇంకా 15 మాసాల సమయం ఉండగానే గొడవలు బయటపడుతున్నాయి. అదే సరిగ్గా ఎన్నికల ముందు వరకు ఈ గొడవలు నివురునిప్పులాగుండి అప్పుడు బయటపడితే అంతే సంగతులు. ఇంతకీ విషయం ఏమిటంటే సుమారు 15 నియోజకవర్గాలో వివాదాలు చాలా తీవ్రస్ధాయిలో ఉన్నాయి. వీటన్నింటినీ పర్మినెంటుగా పరిష్కరిస్తే కానీ మిగిలిన నియోజకవర్గాల్లో ప్రశాంతత ఉండదు.





తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గొడవల కారణంగా మిగిలిన నియోజకవర్గాలపై అందరి దృష్టిపడింది. అనంతపురం జిల్లాలోని హిందుపురం, మడకశిర, చిత్తూరు జిల్లాలోని నగిరి, నెల్లూరు జిల్లాలో రూరల్ నియోజకవర్గం కాకుండా ఉదయగిరి, కావలి, కోవూరు, కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, విశాఖ జిల్లాలోని పాయకరావుపేట, కృష్ణాలోని గన్నవరం, మైలవరం, గుంటూరులోని తాడికొండ, నరసరావుపేట, ప్రకాశంలోని గిద్దలూరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాలున్నాయి. ఇవన్నీ చాలాకాలంగా వివాదాలతో నలుగుతున్నవే. 





పై నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి కాబట్టి అందరికీ తెలిసింది. బయటపడకుండా లోలోపల గొడవలు జరుగుతున్న నియోజకవర్గాలు ఇంకా ఎన్నున్నాయో. కాబట్టి ఒకసారి అన్నీ నియోజకవర్గాలపైన జగన్ సమీక్ష జరిపి వివాదాలున్న నియోజకవర్గాలన్నింటిపైన ఒకేసారి దృష్టి పెట్టి శాశ్వతంగా పరిష్కరించాలి. ఎన్నికలకు ఇంకా చాలాదూరం ఉంది కాబట్టి వివాదాలను పరిష్కరించుకునేందుకు జగన్ కు కావాల్సినంత వ్యవధి ఉంది. ఇపుడు కూడా వివాదాలను శాశ్వతంగా పరిష్కారించకపోతే సమస్యలు బాగా పెరిగిపోవటం ఖాయం.






ఒకవైపు నియోజకవర్గాల్లో ఇన్నివివాదాలు పెట్టుకుని వచ్చేఎన్నికల్లో 175కి 175 నియోజకవర్గాల్లో గెలుపు టార్గెట్ రీచవ్వటం సాధ్యమేనా ? టీడీపీ, జనసేన మీద యుద్ధం చేయటానికి జగన్ కు చాలా సమయముంది. ముందు పార్టీలోని వివాదాలను పరిష్కరించటంపై దృష్టిపెట్టాలి. ఇపుడు బయటపడిన ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని టీడీపీ కోవర్టంటున్నారు. ఇలాంటి టీడీపీ కోవర్టులుగా ఇంకా ఎంతమంది పనిచేస్తున్నారో జగన్ తెలుసుకోవాలి. లేకపోతే చివరకు పుట్టిముణగటం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: