జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జనాల్లో పలుచనచేయటమే టార్గెట్ గా చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా అహర్నశలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మొదటినుండి ఈ బ్యాచ్ అంతా జగన్ కు వ్యతిరేకమే అని జనాలకు బాగా తెలుసు. అందుకనే వీళ్ళు వైసీపీ ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా జనాలు లైట్ తీసుకుంటున్నారు. జనాలంతా నమ్మాలంటే మరిపుడు ఏమిచేయాలి ?
ఈ విషయంలోనే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసినట్లు అనుమానంగా ఉంది. అదేమిటంటే వైసీపీలోని సీనియర్లతోనే వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయించటం. పార్టీలోనే ఉంటు ప్రభుత్వంపై రెగ్యులర్ గా బురదచల్లించేయటం. జగన్ కు వ్యతిరేకంగా తాము చెప్పింది నమ్మని జనాలు అదే విషయాలను వైసీపీ వాళ్ళతోనే చెప్పిస్తే నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆలోచించినట్లున్నారు. ప్రభుత్వంలో ఏదో జరగకపోతే సొంతపార్టీ వాళ్ళే జగన్ పై ఆరోపణలు, విమర్శలు ఎందుకు చేస్తారు ? అని జనాలో ఆలోచించే అవకాశముంది.
మొదట్లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తర్వాత వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి ఇపుడు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మధ్యలో ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళ వైఖరి చంద్రబాబు ఆలోచనలకు అద్దంపడుతోంది. తాజాగా కోటంరెడ్డి ఎవరితోనో మాట్లాడుతు తాను వచ్చేఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేస్తానని చెప్పటంలో అర్ధమేంటి ? వైసీపీ ఎంఎల్ఏ పైగా జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళు. టికెట్ కు ఢోకాలేకపోయినా రెగ్యులర్ గా ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?
వైసీపీలో ఉంటూ టీడీపీ తరపున పోటీచేస్తానని చెప్పారంటేనే టికెట్ విషయంలో చంద్రబాబు నుండి హామీ వచ్చినట్లే కదా అర్ధం ? ఇక్కడే వీళ్ళ ఆలోచనలు అర్ధమైపోతోంది. ఎంతకాలం వీలుంటే అంతకాలం వైసీపీలోనే ఉండి ప్రభుత్వంపై బురదచల్లేసి చివరకు పార్టీని వదిలేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అనుమానంగా ఉంది. ఆనం వైఖరి కూడా ఇలాంటిదే. కాకపోతే కోటంరెడ్డి దూకుడు మనిషికాబట్టి టీడీపీ నుండి పోటీచేస్తున్నట్లు చెప్పారు, ఆనం చెప్పలేదంతే.