హ్యాపీనెస్ అనేది ఒక్కొక్కళ్ళకు ఒక్కో విషయంలో దొరుకుతుంది. ఒకళ్ళకి పాటలు వింటే సంతోషంగా ఉంటుంది. మరొకరికి రుచికరమైన ఆహారం తిన్నపుడు హ్యాపీగా ఫీలవుతారు. ఇంకోళ్ళు మంచి పుస్తకం చదివితే సంతోషంగా ఉంటుంది. మరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు  హ్యాపీగా ఫీలవుతారు ? ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లుతున్నపుడు. స్వతహాగా సినీనటుడు అయిన పవన్ తన సినిమాలు బాగా ఆడినపుడు హ్యాపీగా ఫీలవుతారో లేదో చెప్పలేం.




జగన్ మీద బురదచల్లటంలోనే హ్యాపీగా ఫీలయ్యేట్లున్నారు. అందుకనే సమయం, సందర్భం లేకపోయినా సరే పదే పదే జగన్ పై ట్వీట్లతో బురదచల్లేస్తుంటారు. తాజాగా ‘అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు, ముఖ్యమంత్రికి  నా ప్రత్యేక  శుభాకాంక్షలు...కీ పిటప్’ అంటూ ట్వీటారు. అప్పులతో ఆంధ్ర పేరు జగన్ ఇపుడు మారుమోగించటం ఏమిటో పవన్ కే తెలియాలి. రాష్ట్ర విభజన జరిగినపుడే  ఏపీ ప్రభుత్వం  అప్పులతో మొదలైంది. మొదటిసారి సీఎం అయిన చంద్రబాబునాయుడు ఐదేళ్ళల్లో రు. 2.7 లక్షల కోట్ల అప్పులు చేశారు.




ఇపుడు ఏపీ అప్పులు సుమారు రు. 4 లక్షల కోట్లకు చేరుకున్నది. జగన్ హయాంలో జరుగుతున్న అప్పులకు తాము లెక్కలు చూపిస్తామని మంత్రులు చెబుతున్నారు. మరి చంద్రబాబు హయాంలో జరిగిన అప్పులకు లెక్కలు చూపిస్తారా ? అంటే తమ్ముళ్ళు నోరిప్పటంలేదు. చంద్రబాబు హయాంలో జరిగిన అప్పులగురించి పవన్ ఎందుకు మాట్లాడటంలేదు ?




మిత్రపక్షం బీజేపీ నాయకత్వంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అప్పు రు. 145 లక్షల కోట్లు. ఈమధ్యనే ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పిన లెక్క ప్రకారమే రోజుకు రు. 4400 కోట్లు అప్పులు చేస్తోంది. ఇప్పటికి చేసిన అప్పులకు రోజుకు రు. 2900 కోట్లు వడ్డీయే కడుతోంది. మరి చంద్రబాబుకు మోడీకి కూడా పవన్ శుభాకాంక్షలు చెప్పాలి కదా ? మొత్తానికి ఇలాంటి పనికిమాలిన ట్వీట్లు పెట్టమని ఎవరు సలహాలిస్తున్నారో కానీ శల్యసారధ్యం చేస్తున్నట్లే అనుమానంగా ఉంది. చూద్దాం ఇంకా ఎంతకాలం పవన్ ఇలాగ హ్యాపీగా ఫీలవుతుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి: