సఫారీ డ్రస్సు, కళ్ళకి బ్లాక్ గాగుల్స్, మార్షల్స్ లాంటి సెక్యూరిటిని మామూలుగా జనాలు వీవీఐపీ పర్యటనల్లో మాత్రమే చూస్తారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సెక్యూరిటి అంటేనే పై పద్దతంతా జనాలకు గుర్తొస్తుంది. కానీ ఇపుడు అచ్చం అలాంటి సెక్యూరిటీని పోలిన సెక్యూరిటీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడుకు ఇంతస్ధాయిలో సెక్యూరిటి ఉన్నపుడు తనకు మాత్రం ఎందుకు ఉండకూడదని అనుకున్నారో లేకపోతే తనకు తాను కాబోయే సీఎంగా ఊహించుకుంటున్నారో తెలీదు.
మొత్తానికి తన సెక్యూరిటి స్టైల్ అంతా ఒక్కసారిగా మార్చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చినపుడు పవన్ చుట్టూ 20 మంది సఫారీ డ్రస్ వేసుకుని కళ్ళకు నల్లటి కూలింగ్ గ్లాసెస్ వేసుకున్న సెక్యూరిటి వాళ్ళు కనిపించారు. పవన్ కు ఈ సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడు వచ్చారబ్బా అని ఆరాతీస్తే వాళ్ళంతా ప్రైవేటు సెక్యూరిటి అని తెలిసిందే. ఒకపుడు పవన్ సెక్యూరిటి సిబ్బంది ఆరుమంది మాత్రమే ఉండేవాళ్ళు. అదికూడా మామూలు కలర్ డ్రస్సులోనే ఉండేవారు.
తన సెక్యూరిటి సిబ్బంది విషయంలో పవన్ ఏమాలోచించుకున్నారో తెలీదు కానీ ఒక్కసారిగా వాళ్ళ కతంతా మారిపోయింది. చూడటానికి అచ్చంగా ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటి మాదిరిగానే కనిపిస్తున్నారు. ఒకపుడు ఆరుమంది మాత్రమే ఉండే సెక్యూరిటి నెంబర్ ఇపుడు 20కి పెరిగింది. వీళ్ళంతా పవన్ తో పాటు బుల్లెట్ ప్రూఫ్ మహీంద్రా వెహికల్స్ లోనే ప్రయాణిస్తారు.
తనకు, తన సెక్యూరిటీ+సిబ్బందికి పవన్ ప్రత్యేకంగా ఆరు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను రెడీ చేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా వారాహి పేరుతో మిలిట్రీ రంగు, వాహనాలను పోలినట్లుండే సరికొత్త భారీ వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికి వారాహిని ఎప్పుడు బయటకు తీస్తారో తెలీదు కానీ పవన్ బిల్డప్ అయితే అదిరిపోతోంది. కొత్త వాహనం, సరికొత్త సెక్యూరిటి, అందరినీ ఆకర్షించే సెక్యూరిటి స్టైల్ భలే బాగుంది.