తాజాగా వెల్లడైన ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలతో ఇపుడందరి దృష్టి మరో ఎన్నికమీదపడింది. అదేమిటంటే 23వ తేదీన జరగబోయే ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీ ఎన్నిక పైన. భర్తీ చేయాల్సిన ఏడుస్ధానాలకు ఎనిమిదిమంది పోటీచేస్తున్నారు. కాబట్టి ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపధ్యంలోనే వైసీపీ, టీడీపీ ఒకదాన్ని దెబ్బ కొట్టేందుకు మరోటి ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేనకు దూరమైన ఐదుగురు ఎంఎల్ఏల ఓట్లు వైసీపీకి పడటం ఖాయం.





అలాగే వైసీపీ ఎంఎల్ఏల ఓట్లకోసం తెలుగుదేశంపార్టీ బాగా ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీలో ఇద్దరు రెబల్ ఎంఎల్ఏల ఓట్లను తమకు అనుకూలంగా వేయించుకోవాలని ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఎవరి ఓట్లు ఎవరు వేయించుకుంటారనే విషయాన్ని పక్కనపెట్టేస్తే ఒక ఎంఎల్ఏ రాజీనామాను స్పీకర్ ఆమోదించబోతున్నట్లు ప్రచారం మొదలైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.





తన రాజీనామాను ఆమోదించాలని గంటా గతంలో స్పీకర్ ను కలిసి చాలాసార్లు ఒత్తిడిపెట్టారు. అయితే వివిధ కారణాల వల్ల స్పీకర్ రాజీనామా విషయాన్ని పెండింగ్ లో ఉంచారు. ఇపుడా రాజీనామా లేఖను ఆమోదించేందుకు స్పీకర్ రెడీ అవుతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. స్పీకర్ గనుక గంటా రాజీనామాను ఆమోదిస్తే టీడీపీకి పెద్ద షాకనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో ఇప్పటికే నలుగురు దూరమయ్యారు. దాంతో టీడీపీ బలం 19కి పడిపోయింది.





ఇపుడున్న బలంతో ఎంఎల్సీ స్ధానాన్ని గెలుచుకోవటం కష్టం. అందుకనే వైసీపీలోని రెబల్+అసంతృప్త ఎంఎల్ఏల ఓట్లకోసం టీడీపీ గాలమేస్తోంది. ఈ సమయంలో గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే టీడీపీ బలం 18కి పడిపోతుంది. ఇపుడు గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే టీడీపీ నానా గోలచేయటం ఖాయం. అయితే ఎంత గోలచేసినా ఉపయోగముండదు. ఇదే సమయంలో విశాఖ నార్త్ లో గనుక ఉపఎన్నిక జరిగితే వ్యవహారం భలే రంజుగా ఉంటుంది. మరి స్పీకర్ ఏమిచేస్తారో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: