అవుననే సమాధానం వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారంటే ఎవరికీ తెలీదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఎందుకు కలుద్దామని అనుకుంటున్నారంటే ఎవరూ సమాధానం చెప్పలేదు. అయితే ఒక్కటి మాత్రం నిజం. అదేమిటంటే పవన్ చేష్టలతో ఇటు మిత్రపక్షం బీజేపీ అటు పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్న టీడీపీ నేతలు జుట్లు పీక్కుంటున్నారని.
బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీకి సహకారం అందిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని స్వయంగా పవనే బహిరంగసభల్లో చెప్పారు. దాంతో బీజేపీ నేతలకు మండిపోతోంది. ఈమధ్యనే జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేసి గెలిపించమని అడగను కూడా లేదు. తమకు సహకరించమని బీజేపీ అడిగితే వైసీపీకి మాత్రం ఓట్లేయద్దని చెప్పి టీడీపీ పరోక్షంగా సాయంచేశారు. ఈ విషయమై ఓడిపోయిన అభ్యర్ధుల్లో మాధవ్ ఇదే విషయమై నిలదీస్తే సమాధానం లేదు. బీజేపీని పవన్ మోసం చేశారని మాధవ్ అంటే ఇప్పటివరకు రిప్లై ఇవ్వలేదు.
ఇక టీడీపీతో పొత్తును అధికారికంగా ప్రకటించేసి పొత్తులు పెట్టేసుకోవటమే మిగిలుంది అని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళి అమిత్, నడ్డా అపాయిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ నిమిత్తం రాజస్ధాన్ కు వెళ్ళిన పవన్ అటునుండి అటే ఢిల్లీకి వెళ్ళారని సమాచారం.
బీజేపీని వదిలేసి టీడీపీతో వెళ్ళాలని అనుకున్నపుడు ఇక అమిత్, నడ్డాతో పవన్ కు ఏమిపని. నాలుగు ఎంఎల్సీ ఎన్నికల్లో గెలవగానే చంద్రబాబునాయుడు అండ్ కో వైఖరిలో మార్పొచ్చేసిందట. పవన్ లేకపోయినా ఎన్నికల్లో ఒంటరిగానే గెలిచేస్తామనే కాన్ఫిడెన్స్ పెరిగిపోయి పవన్ను దూరం పెట్టారనే ప్రచారం పెరుగుతోంది. ఈ నేపధ్యంలోనే కేంద్రం పెద్దలతో భేటీ కావాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. అయితే అమిత్, నడ్డాలతో కాకుండా ఏపీ ఇన్చార్జి మురళీధరన్ తో భేటీ అయ్యారు. అసలు ఢిల్లీ పెద్దలతో పవన్ ఎందుకు భేటీ కావాలని అనుకుంటున్నారో అర్ధంకాక బీజేపీ, టీడీపీ నేతలు జుట్లు పీక్కుంటున్నట్లు టాక్. మరి పవన్ సమాధానం చెబుతారా ?