మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా రామోజీరావు అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని సీఐడీ కేసులు నమోదుచేసి విచారణ జరుపుతోంది. ఏ చట్టాల ప్రకారం మార్గదర్శి వ్యాపారం చట్టవిరుద్ధమో సీఐడీ పదేపదే చెబుతోంది. తన వ్యాపారం చట్టబద్ధమా ? లేకపోతే చట్ట విరుద్ధమా అని రామోజీ ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. అయితే గడచిన 60 సంవత్సరాలుగా తాను వ్యాపారం చేస్తున్నానని, తనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని మాత్రమే చెబుతున్నారు.





తాను చెబితే జనాలు నమ్మరనే అనుమానం వచ్చిందేమో. అందుకనే ఎవరెవరి పేర్లతోనో ప్రకటనలిప్పిస్తున్నారు. ఎవరుచెప్పినా చెప్పేదేమిటంటే  వయో వృద్ధుడు, వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాడు, ఎవరు ఫిర్యాదుచేయలేదు, ఎంతో నిబద్ధతతో వ్యాపారం చేస్తున్నాడని మాత్రమే చెబుతున్నారు. రామోజీ చేస్తున్న వ్యాపారం అక్రమమా ? సక్రమమా అని అడిగితే మాత్రం నోరిప్పటంలేదు. చట్టవిరుద్ధంగా వ్యాపారం చేయకూడదంటే రామోజీ అయినా ఎవరైనా చేయకూడదంతే.





వయోవృద్ధుడు, నిబద్ధత, ఎవరు ఫిర్యాదుచేయలేదని ఎంతమంది చెప్పినా చెల్లదు. ఇక్కడ విషయం ఏమిటంటే వాళ్ళను పట్టుకుని వీళ్ళని పట్టుకుని రామోజీ తనకు మద్దతుగా ప్రకటనలు ఇప్పించుకుంటున్న విషయం తెలిసిపోతోంది. వాళ్ళని వీళ్ళని పట్టుకునే బదులు తానే ఒక మీడియా సమావేశం పెట్టి తాను చేస్తున్న వ్యాపారం ఏ విధంగా చట్టబద్ధమో చెప్పచ్చు కదా. పోనీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో డిబేట్లో దిగి మార్గదర్శి వ్యాపారమంతా చట్టబద్ధమే అనిచెప్పి ఉండవల్లి నోరు మూయించచ్చు కదా ?





తనచేతిలోని పనిని చేయకుండా ఎవరెవరితోనో ప్రకటనలు ఇఫ్పించుకుంటున్నారంటేనే తెలిసిపోతోంది రామోజీ ఎంత డిఫెన్సులో పడిపోయారో. తానుచేస్తున్న వ్యాపారమంతా అక్రమమో, సక్రమమో రామోజీకి బాగా తెలుసు. అందుకనే బహిరంగంగా తాను ఏమీ మాట్లాడలేక జనాల సింపథీ కోసం నానా అవస్తలు పడుతున్నారు. నిజంగానే ప్రభుత్వం మార్గదర్శిపైన తప్పుడు కేసులు పెడితే రామోజీ చేతులు ముడుచుకుని కూర్చునే రకమేనా ? ఈ పాటికే  ఊరు వాడా ఏకం చేసేసుండరూ ?



మరింత సమాచారం తెలుసుకోండి: