విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నరేంద్రమోడీ ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. స్టీల్ ఫ్యాక్టరీ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్న కంపెనీల నుండి బిడ్డింగులను ఆహ్వానిస్తు రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ప్రకటన జారీచేసింది. విశాఖ స్టీల్స్ ను అదానీకో లేకపోతే టాటా సంస్ధకో అమ్మేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకుందనే ప్రచారం అందరికీ తెలిసిందే.





ఆమధ్య దక్షిణ కొరియాకు చెందిన స్టీల్ ఉత్తత్పి దిగ్గజ కంపెనీ పోస్కో కూడా వైజాగ్ స్టీల్స్ కు వచ్చిన వెళ్ళిన సంగతి తెలిసిందే. ఎవరో ప్రైవేటు యాజమాన్యం కొనేబదులు అదేదో తామే ఎందుకు కొనుగులో చేయకూడదని కేసీయార్ అనుకున్నారట. వైజాట్ స్టీల్స్ ను తెలంగాణా ప్రభుత్వం కొనుగోలు చేస్తే కొన్ని ఉపయోగాలున్నాయి. మొదటిది ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో  బలమైన అడుగు వేసినట్లుంటుంది. రెండోది సంస్ధను ప్రైవేటుపరం చేయాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్నట్లవుతుంది.





ఇక నాలుగో కారణం ఏమిటంటే తెలంగాణాలో జరుగుతున్న అనేక నిర్మాణ, ప్రాజెక్టులకు అవసరమైన స్టీలును తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఫ్యాక్టరీలో స్టీల్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సింగరేణి నుండే పంపవచ్చు. దీనివల్ల స్టీల్ ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుంది. కాకపోతే కావాల్సింది ఐరన్ ఓర్ గనులు మాత్రమే. ఫ్యాక్టరీ కొనుగోలు చేసిన కంపెనీకి ఎలాగూ గనులను కేంద్రప్రభుత్వం కేటాయిస్తుంది. కాబట్టి ఆ కొరతను కూడా మెల్లిగా అధిగమించవచ్చు.





వైజాట్ స్టీల్స్ ను కొనుగోలు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రాజకీయంగా పై చేయి సాధించినట్లవుతుంది.  స్టీల్ ఫ్యాక్టరీని తెలంగాణా కొనుగోలు చేస్తే రేపటి ఏపీ ఎన్నికల్లో కేసీయార్ కు అనుకూలంగా పనికొస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే విశాఖ స్టీల్స్ ను కొనాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. అవసరమైన ఫీడ్ బ్యాక్ కోసం ఉన్నతాధికారులను వైజాగ్ వెళ్ళి ఫ్యాక్టరీని ప్రత్యక్షంగా పరిశీలించి  వివరాలు తెలసుకోవాలని ఆదేశించారు. బహుశా రెండు మూడురోజుల్లో ఉన్నతాధికారుల బృందం వైజాగ్ వెళ్ళే అవకాశాలున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: