రాష్ట్రంలో రాజకీయమంతా చాలా విచిత్రంగా ఉంటోంది. విచిత్రం ఏమిటంటే రాజకీయమంతా జగన్మోహన్ రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఎందుకంటే ప్రతిపక్షాల అజెండా కూడా జగనే సెట్ చేస్తున్నారు కాబట్టే. ప్రతిపక్షాలు ఎలాంటి అంశాలపైన స్పందించాలి ? ఏ విధంగా స్పందించాలనే విషయాలను కూడా జగనే నిర్దేశిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దాదాపు ఇదే పద్దతిలో రాజకీయం నడుస్తోంది. ప్రతిపక్షాలే కాదు చివరకు ఎల్లోమీడియా రాసే వార్తలను కూడా జగనే డిసైడ్ చేస్తున్నారంటే అతిశయోక్తికాదు.
ఇపుడు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇంటింటి ప్రచారం చేయాలని జగన్ అనుకున్నారు. కొద్దిరోజుల క్రితం గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇపుడు జగనన్నే మన భవిష్యత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎప్పుడైతే గడపగడపకు వైసీపీ అని జగన్ అనగానే చంద్రబాబు అండ్ కో తమ్ముళ్ళు, ఎల్లోమీడియా ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా గోలచేశారు. చాలా రోజులు ఇదే గోల నడిచింది. గడపగడపకు వైసీపీని ప్రతిరోజు చంద్రబాబు అండ్ కో విమర్శిస్తునే ఉండేవారు.
ఇపుడు జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం మొదలవ్వగానే చంద్రబాబు, తమ్ముళ్ళు, ఎల్లోమీడియా జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. టీడీపీనే కాదు సీఫీఐ, జనసేన కూడా జగన్ వ్యతిరేక ప్రచారంలో ఫుల్లుగా బిజీగా ఉంటున్నాయి. విచిత్రం ఏమిటంటే జగనేమో ప్రభుత్వ కార్యక్రమాలను, లబ్దిదారులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతిపక్షాలేమో వ్యక్తిగతంగా జగన్ను టార్గెట్ చేస్తున్నాయి.
గడచిన 13 ఏళ్ళుగా చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా కూడా జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తునే ఉన్నాయి. కాబట్టి ఇపుడు టార్గెట్ చేయటంలో కొత్తేమీలేదు. అయినా ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా పదేపదే అదే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాయి. ఎందుకంటే తనను వ్యక్తిగతంగా చంద్రబాబు అండ్ కో, ఎల్లోమీడియా టార్గెట్ చేసేట్లుగా జగనే వాటికి అజెండా సెట్ చేసేశారు. తన పరిపాలన చూసి వచ్చేఎన్నికల్లో ఓట్లేయమని అడిగేంత సీన్ చంద్రబాబుకు లేదు. అలాగే చంద్రబాబును గెలిపించమని ఎల్లోమీడియా కూడా జనాలకు చెప్పలేకపోతోంది. అందుకనే జగన్ను రాక్షుసుడిగా, అరాచకవాదిగా చిత్రీకరిస్తు ప్రతిపక్షాలు, ఎల్లోమీడి కాలం గడిపేస్తున్నాయి.