ఇంతోటి అవమానం కోసం చంద్రబాబునాయుడు చాలాకాలం  ఎదురుచూశారు. గుడివాడ నియోజకవర్గంలో అడుగుపెట్టాలంటే ఇంతకాలం చంద్రబాబుకు ధైర్యం చాలలేదు. ఎందుకంటే అక్కడున్నది మాజీ మంత్రి, వైసీపీ ఎంఎల్ఏ కొడాలి నాని కాబట్టే. నానీని చంద్రబాబు పదిమాటలంటే చంద్రబాబును నాని వందమాటలంటారు. నాని నోటిగురించి చంద్రబాబుకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ? అందుకనే తాను డైరెక్టుగా ఏమీ మాట్లాడకుండా పక్కవాళ్ళతో నానీని చంద్రబాబు తిట్టిస్తుండేవారు.





అయితే గుడివాడలోకి అడుగుపెట్టిన తర్వాత డైరెక్టుగా కొడాలిని చంద్రబాబు ఎటాక్ చేయకతప్పదు. చేస్తే నాని రియాక్షన్ ఎలాగుంటుందో బాగా తెలుసు. ఎందుకొచ్చిన దరిద్రంలెమ్మని ఇంతకాలం గుడివాడలోకి అడుగుపెట్టలేదు. మూడుసార్లు పర్యటన పెట్టుకుని మళ్ళీ రద్దుచేసుకున్నారు. అలాంటిది ఇదేంఖర్మ..రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు ధైర్యంచేసి వెళ్ళారు. వెళ్ళాక కొడాలిని టార్గెట్ చేశారు. తర్వాత కొడాలికి టార్గెట్ కూడా అయ్యారు.





ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు బహిరంగసభలో మాట్లాడారు. దాదాపు గంటసేపు భారీ సభను ఉద్దశించి మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే జనాలు వచ్చేస్తారని కూర్చోవటానికి వీలుగా పార్టీ నేతలు కుర్చీలు వేశారు. అయితే మొత్తంమీద మూడు నాలుగు వందలమంది కూడా జనాలు లేరు. అంతపెద్ద బహిరంగసభకు చంద్రబాబు వస్తే హాజరయ్యింది కేవలం మూడు నాలుగు వందలమందే అంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచమేథావుల్లో ఒకడిగా భావించే చంద్రబాబు వస్తున్నపుడు నేతలైనా జాగ్రత్తలు తీసుకోవాలి కదా.





టికెట్ కోసం పదిమంది నేతలు పోటీలు పడుతున్నారు కానీ జన సమీకరణ విషయంలో మాత్రం హోలు మొత్తం మీద నేతలంతా  ఫెయిలయ్యారు. చంద్రబాబు పాల్గొన్న బహిరంగసభ అత్యంత పేలవంగా ముగిసిందంటేనే ఆశ్చర్యంగా ఉంది. టికెట్ కోసం పోటీపడుతున్న నేతలు తలా వెయ్యి, రెండు వేలమందిని తీసుకొచ్చినా సభ కొంచెం గౌరప్రదంగా ఉండేది. స్వయంగా చంద్రబాబు వచ్చినా సభకు జనసమీకరణ చేయలేని నేతలు ఇక కొడాలి నానీని ఓడిస్తామంటే ఎవరైనా నమ్ముతారా ? విచిత్రం ఏమిటంటే ఈ సభకు వచ్చిన జనాలను ఎల్లోమీడియా కూడా ఎక్కడా ప్రచురించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: