మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీరావును చంద్రబాబునాయుడు భుజానేసుకుని ఎంతగా మోస్తున్నారో అందరు చూస్తున్నదే. చంద్రబాబు-రామోజీ మధ్య కుదిరిన క్విడ్ ప్రోకో ప్రకారమే వాళ్ళిద్దరు ఒకళ్ళకి మరొకళ్ళు సహకరించుకుంటున్నారని మంత్రులు పదేపదే ఆరోపిస్తున్నారు. అలాంటి మార్గదర్శిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలు చేస్తు 2006లో కేసు వేశారు. అప్పటికేసు అలా అలా సాగుతు ఇప్పటికి పక్వానికి వస్తోంది.





మార్గదర్శి మోసాలపై సుప్రింకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో రామోజీని ఏ1గా ఆయన కోడలు, సంస్ధ ఎండీ శైలజను ఏ2గా కేసులు నమోదుచేసి సీఐడీ విచారణ జరుపుతోంది. ఈ నేపధ్యంలోనే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి మార్గదర్శిపై పోరాటం చేస్తున్న ఉండవల్లితో డిబేట్ కు చాలెంజ్ చేశారు. ఆ చాలెంజ్ ను ఉండవల్లి కూడా స్వీకరించారు. వేదిక నిర్ణయం కాలేదు కానీ తేదీ మాత్రం మే 14 అని నిర్ణయమైంది.





ఈ సందర్భంగా జీవీ ఎల్లోమీడియా ఛానల్లో మాట్లాడుతు మార్గదర్శిపై ఏ ఒక్కళ్ళు ఫిర్యాదు చేయకపోయినా ఏదో కొంపలు ముణిగిపోతున్నట్లు ఉండవల్లి గోల చేయటం ఏమిటని నిలదీశారు. అలాగే ప్రభుత్వం చేస్తున్న కక్షసాధింపు చర్యలకు ఉండవల్లి వత్తాసు పలకుతున్నట్లు ఆరోపించారు. ఎల్లోమీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రావటంలేదు కాబట్టి ప్రభుత్వం రామోజీపై కక్ష కట్టి మార్గదర్శిపై కేసులు పెట్టిందట. దానికి ఉండవల్లి మద్దతిచ్చినట్లు జీవీ చెప్పారు. ఇక్కడే జీవీ తెలివేమిటో తెలిసిపోతోంది. ఉండవల్లి వేసిన కేసులో ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యిందే కానీ ప్రభుత్వం కేసు వేయలేదు. మార్గదర్శిపై గడచిన 17 ఏళ్ళుగా కేసు నడుస్తుంటే ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసు వేయటం ఏమిటో అర్ధంకావటంలేదు.





మార్గదర్శిపై ఎవరు ఫిర్యాదు చేయలేదని రెడ్డి చెప్పటం కూడా అబద్ధమే. ఇప్పటికి ఏడు ఫిర్యాదులున్నాయి. మార్గదర్శి వ్యాపారమే అక్రమమని ఉండవల్లి వాదిస్తుంటే బాధితులు లేరు, ఫిర్యాదు దారుడు లేరని జీవీ చెప్పటం విచిత్రమే.  పైగా డిబేట్లో ఎవరిది పై చేయి ఎవరికి కిందచేయి అని నిరూపించుకోవటానికి కాదట కూర్చునేది. ఉండవల్లి ఆరోపణలు తప్పని తాను నిరూపిస్తానని చెబుతున్న జీవీ అసలు రామోజీ ఎందుకు మాట్లాడటం లేదో అర్ధంచేసుకుంటే అదే పదివేలు.







మరింత సమాచారం తెలుసుకోండి: