పాపం రజనీకాంత్ ఏమనుకుని వచ్చారో కానీ ఫుల్లుగా వాచిపోతోంది. ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రజనీ చెన్నై నుండి వచ్చారు. కృష్ణాజిల్లా పోరంకిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన కార్యక్రమాన్ని బట్టి ఎన్టీయార్ ను ఘనంగా పొగిడేసి ఊరుకునుంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలుండేవి కాదు. అలాకాకుండా చంద్రబాబునాయుడును ఆకాశానికి ఎత్తేశారు. దాంతో వైసీపీకి బాగా మండింది.





వెంటనే మంత్రి రోజా, మాజీ మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు రంగంలోకి దిగిపోయారు. రజనీ చరిత్రనంతా తవ్విపోశారు. దాని ప్రకారం ఇపుడు ఎన్టీయార్ ను యుగపురుషుడని, భగవంతుడి అవతారమని, కలియుగ పురుషుడని పొగిడిన ఇదే రజనీకాంత్ అప్పట్లో వెన్నుపోటు ఎపిసోడ్లో ఏమిచేశారో జనాలకు వివరించారు. 1995లో ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి చావుకు కారకుడయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న చంద్రబాబుకు రజనీ మద్దతుగా నిలబడ్డారు.





వైశ్రాయ్ లో ఎన్టీయార్ ను చంద్రబాబు చెప్పులతో కొట్టించటం తెలిసిన తర్వాత కూడా రజనీ ఖండించలేదు. అంటే ఎన్టీయార్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడవటాన్ని రజనీ సమర్ధించినట్లయ్యింది. అప్పట్లో ఎన్టీయార్ కు వెన్నుపోటును సమర్ధించి, చెప్పులతో కొట్టించినా ఏమీ మాట్లాడని రజనీ ఇపుడు అదే ఎన్టీయార్ ను యుగపురుషుడు, కలియుగపరుషుడని పొగడటం ఏమిటంటు డైరెక్టుగా ఏకిపారేశారు. అప్పుడు వెన్నుపోటు కరెక్టా ? లేకపోతే ఇప్పుడు పొగడటం కరెక్టా చెప్పాలంటు కొడాలి అండ్ కో రజనీని నిలదీశారు. ఎందుకొచ్చామురా ద్యావుడా అని రజనీ అనుకునుంటారు.  ఎందుకంటే వీళ్ళడిగిన దాంట్లో తప్పేమీలేదు కాబట్టి.





వచ్చినవాడు వచ్చినట్లుగా ఎన్టీయార్ గురించి నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్ళకుండా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయాల్సిన అవసరంలేదు. వెనకాముందు ఆలోచించకుండా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును చదివేస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి. బతికున్నపుడు పోట్లుపొడిచి, చెప్పులతో కొట్టించి చనిపోయిన దర్వాత పూలదండలు వేస్తే ఏమిటి ఉపయోగం ? చేసిన పాపం ఊరికేపోతుందా ? ఎన్టీయార్ పెట్టిన శాపనార్ధాలు ఊరికే పోతాయా ? అందుకనే మానసికంగా ఎవరిస్ధాయిలో వాళ్ళు ఆ శాపనార్ధాల ఫలితాలను అనుభవిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: