ఎల్లోమీడియా చాలా స్పీడుగా విశ్వసనీయతను కోల్పోతోంది. ప్రభుత్వం చేసే పనుల్లో తప్పేది ఒప్పేది అని ఉన్నదున్నట్లుగా రాయటం అది ఒక పద్దతి. ఒకవేళ వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రాయాలని అనుకున్నా అందులో కూడా వాస్తవాలుంటే రాయటం మరో పద్దతి. కానీ ఇక్కడ ఎల్లోమీడియాతో సమస్యలు ఏమిటంటే లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనిట్లు రాసి జనాలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి మీదున్న గుడ్డి వ్యతిరేకత కారణంగా జనాల్లో తాము విశ్వసనీయతను కోల్పోయామనే విషయాన్ని గుర్తించటంలేదు.





జగన్ కు వ్యతిరేకంగారెండు రోజుల్లో రెండు తప్పుడు వార్తలు రాసింది ఎల్లోమీడియా. అదేమిటంటే అంతా మేఘాకేనా అనేది ఒక స్టోరి అయితే మనవారు కాదా..అనర్హత వేటు వేయండి అనే హెడ్డింగ్ తో రెండో కథనం రాసింది. అంతా మేఘాకేనా అనే స్టోరీలో పోలవరం ప్రాజెక్టులో ఒక వర్కు మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చేసిందట. టెండర్లలో పాల్గొని అందరికన్నా తక్కువ కోట్ చేసిన సంస్ధకు టెండర్ దక్కటంలో తప్పేముంది. పైగా కోట్ చేసి దక్కించుకున్న వర్కులో మళ్ళీ ఒక శాతం తక్కువకే వర్కు చేస్తామని కంపెనీ ప్రకటిస్తే అది ప్రభుత్వానికి లాభమే కదా.  అయినా ఎల్లోమీడియా తట్టుకోలేక తప్పుడు వార్త రాసింది.





ఇక మనవారు కదా..అనర్హత వేటు వేయండనే కథనంలో కూడా అంతా ఏడుపే. 300 యూనిట్లు విద్యుత్ బిల్లులు కడుతున్న వారిని, సొంతిల్లు ఉన్న వారిని లబ్దిదారుల జాబితాలో నుండి తీసేస్తున్నారని చెప్పింది. పేదలకు ఇచ్చే పట్టాల లబ్దిదారుల జాబితా నుండి అనర్హులను తీసేస్తే ఎల్లోమీడియా ఏడుపేమిటో అర్ధంకావటంలేదు. 300 యూనిట్ల విద్యుత్ వాడుతు, బిల్లులు కడుతున్న వాళ్ళు పేదలు ఎలాగవుతారు ? 300 యూనిట్ల విద్యుత్ వాడుతున్నారంటే తక్కువలో తక్కువ నెలకు రు. 2 వేలు కడుతుంటారు. రు. 2 వేలు బిల్లు కట్టేవాళ్ళే పేదలేనా ?





ఇక సొంతిల్లున్న వాళ్ళని అర్హుల జాబితాలో నుండి తీసేయటంలో తప్పేముంది ? పైగా మన వాళ్ళయితేనే అర్హులుగా చేర్చమని అధికారపార్టీ నేతలు చెబుతున్నారట. మరి టీడీపీ హయాంలో పథకాలు అందిన వాళ్ళని ఎవరు ఎంపికచేశారు ? అప్పట్లో టీడీపీ నేతలు జోక్యం చేసుకోలేదా ? ఏ పార్టీ అధికారంలో ఉన్నా సహజమే కదా. ఇందులో కొత్తగా ఏడవటానికి ఏముంది ? ఇలాంటి ఏడుపు రాతల వల్లే ఎల్లోమీడియా జనాల్లో విశ్వసనీయత కోల్పోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: