వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారింది.  తాత్కాలిక బెయిల్ మంజూరు సందర్భంగా ఎల్లోమీడియా చేసిన ఓవర్ యాక్షన్ మీద జస్టిస్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. జస్టిస్ వ్యాఖ్యలతో ఎల్లోమీడియా ఓవర్ యాక్షన్ ఏమిటి ? హద్దుల్లో ఉండాల్సిన అవసరం ఏమిటనే విషయంపై చర్చ జరుగుతోంది. జస్టిస్ దెబ్బకు ఎల్లోమీడియా డిఫెన్సులో పడిపోయింది. జస్టిస్ దెబ్బకు అవినాష్ బెయిల్ పిటీషన్ ఫై ఎక్కడకూడా ఓవర్ యాక్షన్ చేయలేదు.





మొదటినుండి వివేకా కేసులో అవినాష్ పాత్రపై ఎల్లోమీడియా పాత్ర వివాదాస్పదమవుతునే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే మర్డర్ కేసులో అవినాష్ కు మే 26వ తేదీన జస్టిస్ తాత్కలిక బెయిల్ మంజూరుచేసి తీర్పును బుధవారం అంటే మే, 31వ తేదీన ఇస్తానని చెప్పారు. దీనిపైన ఎల్లోమీడియా ఓ రెంజిలో రెచ్చిపోయింది. ఎందుకంటే సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించి అవినాష్ బెయిల్ పిటీషన్ కొట్టేయాలని ఎల్లోమీడియా కోరుకుంది. అయితే జడ్జి దానికి భిన్నంగా నాలుగురోజుల తాత్కాలిక బెయిల్ ఇవ్వటాన్ని తట్టుకోలేకపోయింది.





బెయిల్ పిటీషన్ విచారణలోనే 31వ తేదీ తీర్పు ఎలావుండబోతోందో కూడా ఎల్లోమీడియాకు అర్ధమైపోయినట్లుంది. అందుకనే తాత్కలిక బెయిల్ ఇవ్వటంపై రెండు ఛానళ్ళల్లో డిబేట్ పెట్టి జడ్జిమీద నోటికొచ్చింది మాట్లాడించారు. మూటలు తీసుకునే జడ్జి అవినాష్ కు తాత్కాలిక బెయిల్ మంజూరుచేసినట్లు ఆరోపించారు. సస్పెన్షన్లో ఉన్న వివాదాస్పద జడ్జి రామకృష్ణను డిబేట్లో కూర్చోబెట్టుకుని ఏబీఎన్ ఛానల్ ఇలాంటి ఆరోపణచేయించింది. డైరెక్టుగా తాను చేస్తే ఇబ్బందుల్లో పడతానని తెలిసే రామకృష్ణతో చేయించినట్లుంది. మరో ఛానల్ మహాన్యూస్ లో కూడా ఇలాంటి ఆరోపణలే వినిపించాయి.





ఈ ఆరోపణలనే జడ్జి గట్టిగా పట్టుకున్నారు. ఛానళ్ళ వైఖరిని తన తీర్పులో తూర్పారబట్టారు. డిబేట్ల పేరుతో ఛానళ్ళు తన వ్యక్తిత్వహనానికి పాల్పడినట్లు మండిపడ్డారు. ఛానళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదుచేశారు. దాంతో ఇపుడు రెండు ఛానళ్ళకు ఇబ్బందులు మొదలవ్వబోతున్నాయి. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు జడ్జీలు నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. ఆ మాటలను పట్టుకుని ఎల్లోమీడియా ప్రభుత్వంపై బురదచల్లేసేవి.  అయితే వాళ్ళ వ్యాఖ్యలు తీర్పుల్లో కనబడేవికావు. కానీ ఇపుడు జస్టిస్ లక్ష్మణ్ తన బాధను, వ్యాఖ్యలను తీర్పులో రికార్డుచేశారు. దాంతో జడ్జి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: