ఈనెల 11వ తేదీ అంటే ఆదివారం విశాఖపట్నంలో బీజేపీ నేతృత్వంలో బహిరంగసభ జరగబోతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిధిగా హాజరవ్వబోతున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేంద్రమంత్రులను మరింతమందిని రెగ్యులర్ గా రప్పించి బహిరంగసభలు, కార్యక్రమాలు పెట్టాలని కమలనాదులు డిసైడ్ అయ్యారు. ఇందులో ఆ పార్టీని తప్పుపట్టాల్సిన అవసరంలేదు. అయితే ఇక్కడే మిత్రపక్షం జనసేన పరిస్ధితి ఏమిటనే చర్చ మొదలైంది.





దీనికి బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ చెప్పిందేమిటంటే బహిరంగసభకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను పిలవటంలేదట. ఎందుకంటే జరగబోయేది పూర్తిగా బీజేపీ సభట. రమేష్ ఇచ్చిన సమాధానం విచిత్రంగా ఏదూ వినటానికి. బీజేపీ ఆధ్వర్యంలో జరగబోతున్న బహిరంగసభే కానీ బీజేపీ కార్యవర్గ సమావేశమో లేకపోతే బీజేపీ కోర్ కమిటి మీటింగో కాదు. బహిరంగసభకు జనాలు తీసుకురావటం తలకుమించిన పని. బీజేపీ నేతలకు అంతసీన్ లేదు.





బీజేపీ నాయకత్వంలో ఎక్కడ సభ జరిగినా పట్టుమని వెయ్యిమందిని రప్పించేంత సీన్ కమలనాదుల్లో ఎవరికీ లేదు. అదే మిత్రపక్షం అధినేత పవన్ ను కూడా ఆహ్వానించుంటే వద్దంటే జనాలు కనబడేవారు. పవన్ వస్తున్నారంటే చాలు అభిమానులే వచ్చేస్తారు. సభలో జనాలు కనబడితే అమిత్ షా కూడా హ్యాపీగా ఫీలవుతారు. బంగారం లాంటి అవకాశాన్ని మరి బీజేపీ నేతలు ఎందుకు వదులుకున్నారు.





సరే పిలవకపోతే పోయారు కానీ ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాల్సిన అవసరంలేదు. బీజేపీ సభకు పవన్ను పిలవటం లేదని బహిరంగంగా చెప్పటమంటే పవన్ను అవమానించటమనే అనుకోవాలి. అసలే రెండుపార్టీల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నది. ఇలాంటి సమయంలో పవన్ను గోక్కోవటం బీజేపీ నేతలకు అవసరమా ? సభకు రమ్మని పిలిస్తే మర్యాదగా ఉండేది. వద్దనుకున్నపుడు  ఊరుకుంటే సరిపోయేది. అంతేకానీ పవన్ను పిలవటంలేదని చెప్పాల్సిన అవసరమే లేదు. మరింత  చిన్నవిషయం కమలనాదులకు తెలీకుండానే ఉంటుందా ? తెలిసికూడా చెప్పారంటే ఏమనుకోవాలి ?

మరింత సమాచారం తెలుసుకోండి: