రోజురోజుకు వైఎస్ సునీత ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతోంది. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకులకు శిక్షలు పడేట్లుగా పోరాటం మానేసి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని జైలుకు పంపటమే ధ్యేయంగా ఓవర్ యాక్షన్ చేస్తున్న విషయం అందరికీ అర్ధమైపోయింది. ఇదే విషయాన్ని కేసు విచారణ సందర్భంగా సుప్రింకోర్టు జడ్జిలు కూడా అభిప్రాయపడ్డారు. అవినాష్ ను జైలుకు పంపటమే టార్గెట్ గా పెట్టుకున్నారా అని సునీతను జడ్జీలు డైరెక్టుగానే అడిగేశారు.





ఇంతకీ విషయం ఏమిటంటే అవినాష్ బెయిల్ రద్దుచేయాలని సుప్రింకోర్టు వెకేషన్ బెంచ్ ముందు సునీత పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ విచారణ మొదలవ్వగానే సునీత తానే కేసును వాదించుకుంటానని చెప్పారు. దానికి జడ్జీలు అభ్యంతరంచెప్పారు. వృత్తిరీత్యా సునీత డాక్టరే కానీ లాయర్ కాదు. ఇదే విషయాన్ని జడ్జీలు మాట్లాడుతు పిటీషనర్ న్యాయశాస్త్రంలో నిపుణురాలు కాదన్న విషయాన్ని గుర్తుచేశారు.  లాయర్ సిద్దార్ధ లూథ్రాను సాయం చేయమని చెప్పారు. అయినా సరే తానే కేసును వాదిస్తానని సునీత పట్టుబట్టారు.





బహుశా తండ్రి మర్డర్ కేసులో కోర్టుల్లో చేస్తున్న పోరాటంతో తనకు లాయర్ గా వాదనలు వినిపించేంత అనుభవం వచ్చేసిందని సునీత అనుకుంటున్నారో ఏమో. ఇదే విషయాన్ని మరోసారి జడ్జీలు మాట్లాడుతు వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలనుకుంటే నష్టపోతారని, పిటీషన్ను డిస్మిస్ చేస్తే తర్వాత వాదించే లాయర్ కు చాలా ఇబ్బందులుంటాయని  హెచ్చరించారు. 





అసలు ఈ కేసును వెకేషన్ బెంచ్ వినాల్సినంత అత్యవసరం ఏముందన్నారు.  సీబీఐ విచారణకు అవినాష్ సహకరించటంలేదని, సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని సునీత వాదించారు. హైకోర్టు తొందరపడి అవినాష్ కు ముందస్తు బెయిల్ ఇచ్చిందన్నారు. దాంతో వెకేషన్ బెంచ్ కు బాగా మండింది. ఈ సమయంలో లూథ్రా జోక్యం చేసుకోగానే జడ్జీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్జంటుగా విచారణ చేయాల్సిన అవసరంలేదని తాము చెప్పినా వినకుండా వాదనలు వినిపించటం ఏమిటంటు నిలదీశారు. సునీత తీరుచూస్తుంటే అవినాష్ ను జైలుకు పంపాలని టార్గెట్ పెట్టుకున్నట్లుందని అనుమానం వ్యక్తంచేశారు. సీబీఐని విచారణకు పిలిపించాలన్న సునీత విజ్ఞప్తిని కోర్టు కొట్టేసింది. కేసు విచారణను 19వ తేదీకి వాయిదావేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: