తెలంగాణా ఎన్నికల్లో పోటీచేసే విషయమై జనసేన అదినేత పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నారా ? తాజాగా ఆయన మాటలు విన్నతర్వాత అలాగే అనిపిస్తోంది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పోటీచేస్తుందని గతంలోనే ప్రకటించారు. అయితే ప్రకటన తర్వాత మళ్ళీ ఉలుకుపలుకు లేదు. అలాంటిది తాజాగా 26 నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కష్టపడాలని 26 మందికి చెప్పారు.





119 నియోజకవర్గాలుంటే 26 నియోజకవర్గాలకు మాత్రమే ఇన్చార్జీలను నియమించటం, ఎన్నికల్లో బాగా కష్టపడాలని చెప్పటంతోనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. బహుశా 26 నియోజకవర్గాల్లోనే జనసేన పోటీచేయబోతున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే పవన్ టార్గెట్ పెట్టుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పోటీచేసే విషయమై పవన్ ఆసక్తిగా ఉన్నారట.





రాబోయే ఎన్నికల్లో పార్టీ పోటీచేయాలని డిసైడ్ అయిన పవన్ ఒంటరిపోటీకి రెడీ అవుతున్నారు. తెలంగాణాలో ఎవరితోను పొత్తులు పెట్టుకోవటంలేదని స్పష్టంగా చెప్పారు. ఏపీలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తెలంగాణాలో మాత్రం పట్టించుకోవటంలేదు. పైగా జనసేనతో తెలంగాణాలో తమకు ఎలాంటి పొత్తులేదని గతంలోనే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టంగా ప్రకటించారు. అయితే అప్పటి ప్రకటనకు పార్టీ కట్టుబడుందా లేకపోతే ఏమైనా పునరాలోచన చేస్తున్నదా అన్న విషయమై  క్లారిటిలేదు. అలాగే ఏపీలో టీడీపీతో పొత్తుకోవాల్సిందే అని పవన్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే.





మరి తెలంగాణా ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకుంటారా అన్నది కూడా తేల్చలేదు. తొందరలోనే తెలంగాణాలో వారాహి యాత్రకు పవన్ ప్లాన్ చేస్తున్నారు. సోమవారం పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో తెలంగాణాలో వారాహి యాత్రగురించి కూడా చర్చించారు. యాత్రకు అవసరమైన రూట్ మ్యాపును రెడీచేయాలని తెలంగాణా నేతలను, 26 మండి ఇన్చార్జిలను కోరారు. ముందుగా ఇన్చార్జిలను నియమించిన 26 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర ఉంటుందని పార్టీవర్గాలు చెప్పాయి. కాబట్టే 26 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పవన్ డిసైడ్ అయినట్లున్నారు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: