జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి మరీ ఇంతగా దిగజారిపోయిందా ? పార్టీ ట్విట్టర్ ఖాతాలో పవన్ ఇచ్చిన ప్రకటన చూడగానే అందరు ఆశ్చర్యపోతున్నారు. జనసేనపార్టీకి వాలంటీర్లుగా పనిచేయటానికి ఇష్టపడే వాళ్ళు 9281041479 నెంబర్ కు ఫోన్ చేయమని రిక్వెస్టుచేసుకున్నారు. జనసేన ఏమిటి వాలంటీర్లు ఏమిటి పవన్ రిక్వెస్టుచేసుకోవటం ఏమిటి ? అన్నదే అర్ధంకావటంలేదు.
తమ పార్టీకి లక్షలమంది కార్యకర్తలున్నారని, క్రియాశీలక కార్యకర్తలు, నేతలున్నారని పదేపదే చెప్పుకుంటున్నారు. మెంబర్ షిప్ డ్రైవ్ కు బ్రహ్మాండమైన స్పందన వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. బుధవారం నుండి తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్రకూడా మొదలైంది. ఈ సమయంలో జనసేన పార్టీకి వాలంటీర్ల అవసరం ఏమొచ్చింది ? పార్టీలకు కార్యకర్తలు, నేతలే ఉంటారుకానీ వాలంటీర్లు ఉండదరు కదా. జనసేనేమీ స్వచ్చంద సంస్ధ కాదు వాలంటీర్లుండటానికి.
అయినా పవన్ అలా రోడ్డుమీదకు వచ్చి నిలబడితే అభిమానులే వచ్చి చుట్టుముట్టేస్తారు కదా. వీళ్ళకి అదనంగా పార్టీ కార్యకర్తలు ఉండనే ఉంటారు. వీళ్ళని కాదని జనసేనకు వాలంటీర్ల అవసరం ఏమొచ్చింది ? హెమిటో పవన్ వైఖరంతా గందరగోళంగా తయారవుతోంది. ఎన్నికలు ఎప్పుడుపెట్టినా పోటీకి రెడీ అనంటారు. ఎన్నికలు పెట్టడమే ఆలస్యం అధికారంలోకి వచ్చేయటమే అంటారు. రాబోయే జనసేన ప్రభుత్వమే అని కాబోయే సీఎం పవనే అని నాదెండ్ల మనోహర్, నాగబాబు పదేపదే రాష్ట్రమంతా తిరిగి చెబుతున్నారు.
ఇదంతా నిజమే అనుకుని నమ్మేజనాలు కూడా ఉంటారు. మరిలాంటి పరిస్ధితుల్లో వాలంటీర్లు కావాలని ట్విట్టర్లో రిక్వెస్టుచేయటంలో అర్ధమేంటి ? పార్టీకోసం పనిచేయటానికి కార్యకర్తలు, నేతలే ఉన్నారు. అలాగే వారాహి యాత్రను విజయవంతంచేయటానికి కూడా వీళ్ళే ముందుంటారు. మరి తాజా ప్రకటనకు అర్ధంఏమిటో పవనే చెప్పాలి. ఈ ప్రకటన చూసిన తర్వాత మిత్రపక్షం బీజేపీ ఏమనుకుంటోంది ? పొత్తు పెట్టుకుందామని అనుకుంటున్న తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు రియాక్షన్ ఏమిటో తెలీదు. మొత్తానికి చిన్న ప్రకటన, రిక్వెస్టుతో పవన్ లోని గందరగోళం అర్ధమైపోతోంది.