నిజమెంతో తెలీదుకానీ తొందరలోనే నెల్లూరు జిల్లా నుండి జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ తగలబోతోందట. ఇంతకీ విషయం ఏమిటంటే మాజీమంత్రి, జగన్ కు అత్యంత సన్నిహిత మద్దతుదారుడు కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనీల్ కుమార్ యాదవ్ తొందరలోనే పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారంటు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. చాలాకాలంగా పార్టీలో అనీల్ కు వ్యతిరేకంగా బలమైన వర్గం పనిచేస్తోంది. తెరముందు అందరికీ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కనబడుతున్నారు.
అయితే తెరవెనుక రూమ్ కు మద్దతుగా పార్టీలోని పెద్ద తలకాయలే ఉన్నట్లు అనీల్ అనుమానిస్తున్నారు. ఆమధ్య జగన్ నెల్లూరు టూర్లో అనీల్-రూప్ మధ్య సయోధ్య చేశారు. ఇద్దరు చేతులు కలిపారు. దాంతో వివాదాం సద్దుమణిగిందనే అనుకున్నారు. కానీ అందరు అనుకున్నట్లు వివాదం సద్దుమణగకపోగా మరింత పెరిగింది. అనీల్ కు వ్యతిరేకంగా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగులు జరుగుతున్నాయట. ఇదంతా పార్టీలోని కొందరు తన వ్యతిరేకుల ప్రోత్సాహం కారణంగానే జరుగుతున్నట్లు మాజీమంత్రి అనుమానిస్తున్నారు.
నిజానికి అబ్బాయ్ రాజకీయ జీవితం ఇంతలా వెలుగుతోందంటే అందుకు బాబాయ్ కష్టం చాలావుందట. అయితే అనీల్ మంత్రయిన తర్వాత ఏమైందో ఏమో ఇద్దరికీ చెడింది. తన పేరుచెప్పుకుని తన బాబాయ్ రూప్ పంచాయితీలు చేసి బాగా డబ్బులు సంపాదిస్తున్నారని అనీల్ అనుమానించారు. అందుకనే రూప్ ను దూరంగా పెట్టేశారు. దాంతో చెప్పుడు మాటలు విని తనపై అబ్బాయ్ ఆరోపణలు చేసినట్లు రూప్ మండిపోయారు.
అక్కడ మొదలైన విభేదాలు తర్వాత తీవ్రస్ధాయికి చేరుకున్నాయి. రూప్ ను పార్టీలో నుండి బయటకు పంపేయాలని అనీల్ ఎన్నిసార్లు చెప్పినా జగన్ పట్టించుకోలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. దాంతో అనీల్ బాగా మంటమీదున్నారట. అందుకనే చాలారోజులుగా పార్టీలో అబ్బాయ్ యాక్టివ్ గా లేరు. మొన్ననే జగన్ నిర్వహించిన ఎంఎల్ఏల మీటింగుకు కూడా హాజరుకాలేదు. ఇప్పటికే ముగ్గురు ఎంఎల్ఏలను పార్టీయే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల తర్వాత అనీల్ నెల్లూరులో అడుగుపెట్టారు. తన మాట ఎక్కడా చెల్లుబాటు కానపుడు ఇక పార్టీలో ఉండి ఏమిటి ఉపయోగమని అబ్బాయ్ మద్దతుదారులతో అన్నట్లు ప్రచారం జరుగుతోంది.