ఇపుడీ విషయంపైనే పొలిటికల్ సర్కిళ్ళల్లో చర్చ జరుగుతోంది. మహాభారతంలో ‘తానోడి నన్నొడ్డెనా లేక నన్నొడ్డి తానోడెనా’ ? అని కౌరవసభలో ద్రౌపది ప్రశ్నిస్తుంది. ఇపుడీ పద్దతిలోనే టీడీపీ పరువు ఎల్లోమీడియా తీసేసిందా ? లేకపోతే ఎల్లోమీడియా పరువే టీడీపీ తీసేసిందా ? అన్నది అర్ధంకావటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్డీయేలో టీడీపీ చేరబోతోందని ఎల్లోమీడియా పెద్ద వార్త రాసింది. తాను వార్త రాయటమే కాకుండా ఎన్డీయేలోకి టీడీపీ చేరబోతోందనే విషయాన్ని జాతీయ మీడియా సంస్ధలు ఊదరగొడుతోందని చెప్పింది.
బహుశా ఎల్లోమీడియా ఉద్దేశ్యం ఏమిటంటే ఎన్డీయేలో టీడీపీ చేరబోతోందని చెబితే జగన్మోహన్ రెడ్డి భయపడిపోతారనేమో. ఎన్డీయేలో టీడీపీ చేరబోతోందని చెప్పి ఊరుకోలేదు. భవిష్యత్తులో రాగల మార్పులు, జగన్ కు ఎదురవ్వబోయే సమస్యలు అని చాలా విషయాలే రాసేసింది. ఈనెల 18వ తేదీన ఢిల్లీలో జరగబోయే ఎన్డీయే భాగస్వామపార్టీల సమావేశానికి టీడీపీకి కూడా ఆహ్వానం అందిందని చెప్పేసింది. బీజేపీలో ఎవరి నుండి ఆహ్వానం అందిందనే విషయం రాయలేదు. టీడీపీలో ఎవరికి ఆహ్వానం అందిందో కూడా చెప్పలేదు.
తలా తోక లేకుండా ఒక పిచ్చి వార్తను రాసేసింది. అయితే విచిత్రం ఏమిటంటే సదరు వార్తను టీడీపీ ఖండించటం. ఇలాంటి తప్పుడువార్తలు రాయటం ఎల్లోమీడియాకు దాన్ని ఎంజాయ్ చేయటం టీడీపీకి అలవాటే. అయితే ఇపుడు మాత్రం ఖండనిచ్చేసింది. దాన్ని ఎల్లోమీడియా కూడా ప్రకటించింది. అంటే ఇక్కడ అర్ధమైంది ఏమిటంటే గాలిని పోగేసి ఎల్లోమీడియా టీడీపీకి మద్దతుగా ఒక పిచ్చివార్తను రాసేసింది. అయితే దానికి సమాధానం చెప్పుకోవాల్సింది టీడీపీనే కాబట్టి వెంటనే దానికి ఎవరో ఖండనిచ్చేశారు.
ఖండన కూడా ఎలాగుందంటే ఎన్డీయే మీటింగ్ జరగబోతోందన్న విషయం కూడా తమకు తెలీదని ఎవరో కీలకనేత చెబితే దాన్ని ఎల్లోమీడియా రాసుకుంది. ఇలాంటి తప్పుడు వార్తలు రాయటం వల్లే జనాల్లో క్రెడిబులిటి పోయిందన్న విషయం ఇప్పటికైనా అర్ధమవుతుందో లేదో. జగన్ మీద గాలినిపోగేసి ఏమి రాసినా చెల్లుబాటవుతుంది కానీ బీజేపీ మీద ఇలా గాలి వార్తలు రాస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ? పైగా నరేంద్రమోడీని కూడా వార్తలో ఇన్వాల్వ్ చేసి తప్పుడు వార్తలు రాస్తే కమలనాదులు అసలు ఒప్పుకోరు. అందుకనే తప్పుడు వార్తరాసి టీడీపీ పరువును ఎల్లోమీడియా తీసేస్తే, దాన్ని ఖండించటం ద్వారా ఎల్లోమీడియా పరువును టీడీపీ తీసేసింది.