జనేసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్  కు వాలంటీర్లే ప్రధాన కారణమని ఆరోపించారు.  ఏలూరులో మొదలైన వారాహియాత్ర రెండో విడతలో పవన్ పై వ్యాఖ్యలుచేశారు. నిజానికి వాలంటీర్ల వ్యవస్ధపై దేశంలోని చాలా రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. వాలంటీర్లు అందిస్తున్న సేవలపై చాలారాష్ట్రాలు సంతోషం వ్యక్తంచేశాయి. వాలంటీర్లు అందిస్తున్న సేవల విషయంలో మామూలు జనాలు కూడా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు.





ఎక్కడో కొందరు దారితప్పి తప్పుడు వ్యవహరిస్తున్నారు. వాళ్ళమీద ఫిర్యాదులు రాగానే ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు కూడా తీసుకుంటోంది. హోలు మొత్తంమీద వాలంటీర్ల వ్యవస్ధంటే అందరు హ్యాపీ గానే ఉన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమపథకాలను అర్హులైన జనాలకు అందేట్లుచూడటం, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారమయ్యేట్లుగా చూడటమే వాలంటీర్ల ప్రధాన బాధ్యత. ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఇన్చార్జిగా ఉంటారు కాబట్టి ఆ కుటుంబసభ్యులతో వ్యక్తిగత పరిచయాలుండటం సహజం.





దీనివల్ల రాబోయే ఎన్నికల్లో తమకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయేమోనని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కు భయం పెరిగిపోతున్నట్లుంది. అందుకనే ఈ వ్యవస్ధపై జనాల్లో వ్యతిరేకత తీసుకురావటానికి ప్లాన్ చేసినట్లున్నారు. ఇందులో భాగంగానే వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిజానికి పవన్ చేసిన ఆరోపణ చాలా తీవ్రమైనది. ఈ విషయాన్ని తనకు కేంద్ర నిఘాసంస్ధ చెప్పిందన్నారు. అసలు కేంద్ర నిఘాసంస్ధ పవన్ కు ఎందుకు చెబుతుంది ? పవన్ కున్న హోదా ఏంటసలు ? పవన్ ఆరోపణలు నిజమే అయితే రాష్ట్రప్రభుత్వంపై ఎప్పుడో చర్యలు తీసుకునేవాళ్ళే. అలాకాకుండా జనాలను అప్రమత్తంచేయమని నిఘాసంస్ధ పవన్ కు చెప్పిందట.





పవన్ ది మతిలేని మాటలని ఇక్కడే అర్ధమైపోతోంది. నిరాధార ఆరోపణలు చేసినా ప్రభుత్వం ఎందుకు ఊరుకుందో అర్ధంకావటంలేదు. మహిళా కమీషన్ తరపున నోటీసులు ఇవ్వబోతున్నట్లు ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. దీనివల్ల ఏమవుతుంది ? వాలంటీర్లు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. మొత్తానికి వాలంటీర్ల వ్యవస్ధంటే పవన్ ఎంత భయపడుతున్నారో అర్ధమైపోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: