జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధైర్యమెంత బయటపడింది. ఏలూరు వారాహియాత్రలో పవన్ మాట్లాడుతు రాష్ట్రంలో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగుకు వాలంటీర్లే ప్రధాన కారణమని ఆరోపించారు. అప్పటినుండి పవన్ ఆరోపణలక వ్యతిరేకంగా వాలంటీర్లు రెడ్డెక్కారు. పోస్టర్లకు చెప్పుల దండలు వేయటం, పోస్టర్లను చెప్పులతో కొట్టడం, పవన్ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. పవన్ కు వ్యతిరేకంగా ఇంత గందరగోళం జరుగుతుంటే ప్రతిపక్షాల్లో ఏ ఒక్కటీ మద్దతుగా నిలవలేదు.





పవన్ ఎప్పుడైతే హ్యూమన్ ట్రాఫిక్ అన్నారో వెంటనే దేశంలో ఆడవాళ్ళ మిస్సింగ్ కేసుల అంశంపై  అందరిచూపు పడింది. దాంతో అసలు విషయం బయటపడింది. పవన్ చేసిన ఆరోపణల ప్రకారమైతే రాష్ట్రంలో 30 వేల మంది ఆడవాళ్ళు మిస్సవుతున్నారట. పవన్ ఆరోపణలు నిజమే అయితే ఇది చాలా పెద్ద విషయమనే చెప్పాలి. సరే ఇక విషయానికి వస్తే మిస్సింగ్ కేసుల్లో  ఏపీ కన్నా పదిరాష్ట్రాలు ముందున్నాయి. ఇందులో తెలంగాణా 6 వ స్ధానంలో నిలుస్తోంది.





2021లో తెలంగాణాలో 13,360 మంది మహిళలు మిస్సయినట్లు కేసులు నమోదయ్యాయి. రికవరీ శాతం 87. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే మిస్సింగ్ కేసులు 10 వేలు మాత్రమే. ఇందులో రకవరీ శాతం 78. ఇవన్నీ నేషనల్ క్రైం రికార్డ్స్  బ్యూరో లెక్కల ప్రకారమే. అంటే కేంద్ర హోంశాఖలో పనిచేసే వింగ్ విడుదలచేసిన లెక్కలు.





మరి కేంద్రం జారీచేసిన లెక్కల ప్రకారం తెలంగాణా 6వ స్ధానంలో ఉంటే పవన్ ఈ విషయం మీద ఎందుకు మాట్లాడటంలేదు. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణాలో పరిస్ధితి చాలా అన్యాయంగా ఉందని లెక్కలే చెబుతున్నాయి. అయినా పవన్ కు ఈ లెక్కలు కనబడటంలేదా ? లేకపోతే కేసీయార్ అంటే భయంవల్లే తెలంగాణా విషయమై నోరిప్పటంలేదా ? రెండింటిలో ఏదికరెక్టంటే కేసీయార్ అంటే భయమనే అనిపిస్తోంది. అప్పులు, నేరాల సంఖ్య, మిస్సింగ్ కేసుల సంఖ్య ఇలా ఏది తీసుకున్నా తెలంగాణా ముందుంటే ఇవేవీ పవన్ కు కనిపించకపోవటానికి కేసీయార్ అంటే ఉండే భయం తప్ప మరో కారణం కనబడటంలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: