మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆశలపై సుప్రింకోర్టు నీళ్ళు చల్లేసినట్లే కనబడుతోంది. మంగళవారం అంటే 11వ తేదీన మూడు రాజధానులపై  జరగాల్సిన విచారణను ఏకంగా డిసెంబర్ కు వాయిదావేసింది. ఒక కేసు విచారణను ఏకంగా ఐదునెలలు వాయిదా వేయటమే ఆశ్చర్యంగా ఉంది. ఒకపుడే ఇదే కోర్టు మూడు రాజధానుల విచారణలో స్పీడు పెంచుతామని ప్రకటించింది. అయితే ఆ ప్రకటన ప్రకటనగా మాత్రమే మిగిలిపోయింది.





నెలల తరబడి వాయిదాలు పడుతు చివరకు ఇపుడు డిసెంబర్ కు వాయిదాపడింది. ఎంత వీలైత అంత తొందరగా రాజధానుల వివాదాన్ని సుప్రింకోర్టు క్లియర్ చేస్తే బాగుంటుందని ప్రభుత్వం చాలాసార్లు కోరింది. అందుకు సుప్రింకోర్టు కూడా సానుకూలంగానే స్పందించింది. అయితే ఆ సానుకూలత ఆచరణలో మాత్రం కనబడటంలేదు. సుప్రింకోర్టులో విచారణ తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని జగన్ అనుకుంటున్నారు. అందుకనే విచారణ తొందరగా జరగాలని కోరుకుంటున్నది.





అయితే సుప్రింకోర్టు మాత్రం ఇతకుమించిన అనేక కేసులు అత్యవసర జాబితాలో ఉన్నాయని చెప్పింది. వచ్చేనెల 2వ తేదీనుండి కాశ్మీర్ ఆర్టికల్ 370, నవంబర్ వరకు రాజ్యాంగ ధర్మాసనం కేసులు ఉన్నట్లు చెప్పింది. మూడు రాజధానుల కన్నా ముఖ్యమైన కేసులున్న కారణంగానే డిసెంబర్ కు వాయిదా వేసినట్లు వివరించింది. ఈలోగా వివిధ కోర్టుల్లో అంటే హైకోర్టుల్లో ఉన్న కేసులన్నింటినీ సుప్రింకోర్టుకే బదిలీ చేయించుకుంటామని చెప్పింది. అన్నీ కేసులను ఒకేచోట విచారణ చేస్తామని ప్రకటించింది.





ప్రభుత్వం తరపున లాయర్ కేకే వేణుగోపాల్ ఎంత ప్రయత్నించినా అత్యవసరంగా వినటానికి ఇష్టపడలేదు. దాంతో రాబోయే సెప్టెంబర్లో జగన్ తన క్యాంపాఫీసును వైజాగ్ తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మామూలుగా అయితే న్యాయస్ధానంలో కేసు గెలిచి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరగేట్లుగా లేదని అర్ధమైపోయింది. అందుకనే శాసన, న్యాయరాజధానుల అంశాన్ని పక్కనపెట్టేసి తాను మాత్రం పరిపాలనా రాజధాని అని చెప్పకుండా వైజాగ్ లో క్యాంపు వేయబతోతున్నారు. మరి డిసెంబర్లో మొదలయ్యే విచారణ ఎప్పటికి ముగుస్తుందో ఎవరు చెప్పలేకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: