రెండుసార్లు ఎంఎల్ఏగా పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరుతున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీచేయాలని పంచకర్ల గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వైసీపీలో ఉంటే తనకు టికెట్ దొరకదని అర్ధమైపోయింది. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎంఎల్ఏ అదీప్ రాజ్ యాక్టివ్ గా ఉన్నారు. అందుకనే ఈరోజు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పంచకర్ల రాజీనామా చేశారు.





వైసీపీకి రాజీనామా చేసిన పంచకర్ల టీడీపీలో చేరుతారా లేకపోతే జనసేనలో చేరుతారా అన్నది సందేహంగా ఉంది. టీడీపీలో టికెట్ దక్కే అవకాశంలేదు. ఎందుకంటే అక్కడ నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి యాక్టివ్ గా ఉన్నారు. కాబట్టి బండారును కాదని పంచకర్లకు చంద్రబాబునాయుడు టికెట్ ఇచ్చే అవకాశంలేదు. కచ్చితంగా పోటీచేయాలని అనుకుంటున్న ఈ మాజీ ఎంఎల్ఏకి మిగిలింది జనసేన మాత్రమే.





అందుకనే జనసేనలో చేరి టీడీపీతో పొత్తుంటే నియోజకవర్గాన్ని జనసేన తీసుకుని తాను పోటీచేయాలని పంచకర్ల ప్లాన్ చేశారట. ఇదే విషయాన్ని ఇప్పటికే పవన్ కల్యాణ్ తో మాట్లాడుకున్నారని సమాచారం.  2009లో పంచకర్ల రాజకీయ జీవితం మొదలైందే ప్రజారాజ్యంపార్టీతో. ఆ ఎన్నికల్లో పీఆర్పీ తరపున పోటీచేసిన పంచకర్ల గెలిచారు. ఆ తర్వాత పరిణామాల కారణంగా యలమంచిలిలో టీడీపీ తరపున  2014లో పోటీచేసి గెలిచారు. మొత్తానికి ఇంతకాలానికి జనసేనలోకి ఒక గట్టి నేత చేరే అవకాశాలున్నాయట.





ఇప్పటివరకు జనసేనలో గట్టి నేత అని చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను పవన్ ఓడిపోయారు. కాబట్టి పవన్ను గట్టినేతని చెప్పేందుకు లేదు. ఇక రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఈయన కాంగ్రెస్ గాలిలో రెండుసార్లు గెలిచారంతే. తర్వాత జనసేన తరపున పోటీచేసి ఓడిపోయారు. ఈయనకంటు సొంత వర్గమంటు లేదు. కాబట్టి ఈయన కూడా గట్టి నేతకాదు. అందుకనే పంచకర్ల గనుక చేరితే జనసేనలో మొదటి గట్టి నేతని చెప్పుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: