హిమాన్షుకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇంతకీ ఎవరీ హిమాన్షు, ఎందుకు డిమాండ్ పెరిగిపోతోంది ? అని అనుకుంటున్నారా ? హిమాన్షు ఎవరంటే కల్వకుంట్ల హిమాన్షు. ఇప్పటికీ అర్ధంకాలేదా ? కేసీయార్ మనవడు, మంత్రి కేటీయార్ కొడుకు. సరే హిమాన్షుకు ఎందుకింత డిమాండ్ పెరిగిపోయింది ?  ఎందుకంటే తమ స్కూళ్ళని బావుచేయించమని చాలా స్కూళ్ళనుండి విద్యార్ధులు రిక్వెస్టులు పెడుతున్నారు. ఎందుకంటే మొన్ననే శేరిలింగపల్లి నియోజకవర్గం కేశవనగర్ లోని ప్రభుత్వ స్కూలును రిపేర్ చేయించారు.





కొర్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటి(సీఎస్ఆర్)కింద పై స్కూలును హిమాన్షు చొరవ తీసుకుని రిపేర్లు చేయించాడు. బాత్ రూములు, స్కూలు మెట్లు, తలుపులు, మంచినీటి వసతి తదితరాలను బాగుచేయించారు. ఇందుకోసం తన స్నేహితుల నుండి రు. 40 లక్షలు వసూలు చేశారు. ఇంకెవరో పెద్దవాళ్ళు కూడా విరాళాలు ఇచ్చారు. కేసీయార్ మనవుడు అడిగితే విరాళాలు ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటారా ? అందులోను ఎన్నికల సమయంలో.





కేశవనగర్ స్కూలు రిపేర్లు చేయించిన తర్వాత ఒక సమావేశంలో హిమాన్షునే ఈ విషయాన్ని వివరించారు. దాంతో ఆ స్కూలుతో పాటు హిమాన్షు కూడా సోసల్ మీడియాలో బాగా పాపులరైపోయారు. అప్పటినుండి తెలంగాణా వ్యాప్తంగా ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్ధులు హిమాన్షు వెంటపడ్డారు.  తమ స్కూళ్ళని కూడా ఏదో పద్దతిలో రిపేర్లు చేయించాలని పదేపదే రిక్వెస్టులు, డిమాండ్లు చేస్తున్నారు.





తమ స్కూళ్ళ పరిస్ధితులను ఫొటోల రూపంలో విద్యార్ధులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తు వాటిని హిమాన్షు ఖాతకు ట్యాగ్ చేస్తున్నారు. దాంతో హిమాన్షు సోషల్ మీడియా ఖతా మొత్తం స్కూళ్ళ ఫొటోలు, రిక్వెస్టులతోనే నిండిపోతోందట. కేశవనగర్ స్కూలును చూసిన తర్వాత కానీ ప్రభుత్వ స్కూలు ఇంత అధ్వాన్నంగా ఉంటుందా అన్న విషయం తనకు తెలీలేదని హిమాన్షు చెప్పటమే పెద్ద హైలైట్ అయిపోయింది. మన ఊరు-మనబడి పథకంలో మరి కేసీయార్ స్కూళ్ళని ఏమి బాగుచేయిస్తున్నట్లు ? అంటు సెటైర్లు పెరిగిపోతున్నాయి. మరి హిమాన్షు ఏమి సమాధానం చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: