రాబోయే ఎన్నికల్లో దగ్గుబాటి పురందేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గానికే పోటీచేయబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి.  పురందేశ్వరి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీచేస్తారా లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గానికి చేస్తారా అనే చర్చ పార్టీలో నడుస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేయటానికే మొగ్గుచూపుతున్నట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం నుండి పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇందుకు కారణం ఏమిటంటే ఈ నియోజకవర్గం నుండి ఆమె భర్త చాలాసార్లు పోటీచేసుండటమే.





ఆమె భర్త యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నపుడు పర్చూరు నియోజకవర్గం నుండి ఐదుసార్లు గెలిచారు. మూడుసార్లు టీడీపీ తరపున గెలిస్తే రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. ఓడిపోయింది కూడా కేవలం 1647 ఓట్ల తేడాతోనే. అంటే గెలుపోటములతో సంబంధంలేకుండా పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటికి బాగా పట్టున్న విషయం అర్ధమవుతోంది. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గంతో పాటు బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.





అందుకనే ఈ నియోజకవర్గంలో పోటీచేస్తే తమ సామాజికవర్గం ఓట్లతో పాటు వ్యక్తిగతంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో సన్నిహితంగా ఉన్న ఇతర సామాజికవర్గాల ఓట్లు కూడా తనకు పడతాయని పురందేశ్వరి అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇక్కడి నుండి పోటీచేస్తే గెలుపు గ్యారెంటీ అని ఆమె నమ్మకంతో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఆమె నమ్మకం ఎలాగున్నా గెలుపు అంత ఈజీ కాదని గ్రౌండ్ లెవల్ సమాచారం బట్టి అర్ధమవుతోంది.





ఎందుకంటే నరేంద్రమోడీ ప్రభుత్వంపై జనాల్లో బాగా మంటుంది. ఆ మంటతోనే జనాలు కమలనాదులకు ఎక్కడా కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వటంలేదు. పురందేశ్వరి ఇప్పటి వరకు పార్లమెంటుకే పోటీచేశారు. నాలుగుసార్లు పోటీచేస్తే రెండుసార్లు గెలిచారు. మొదటిసారి బాపట్లలో తర్వాత వైజాగ్ లో పోటీచేసి గెలిచారు. మూడోసారి రాజంపేటలో నాలుగోసారి మళ్ళీ విశాఖకు పోటీచేసి ఓడిపోయారు. ఇపుడు ఆమె బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు కాబట్టి పార్లమెంటుతో పాటు అసెంబ్లీకి కూడా పోటీచేయమని పార్టీలో కొందరు చెబుతున్నారట. చివరకు ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్సుగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: