జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతటి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారో ఇపుడు అందరికీ అర్ధమయ్యుంటుంది. రాజకీయాలన్నాక ఆరోపణలు-ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలు చాలా సాధారణం. కానీ పవన్ మాత్రం తాను జగన్మోహన్ రెడ్డి మీద నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తు ప్రత్యారోపణలకు మాత్రం గింజుకుపోతున్నారు. తాను జగన్ను నాలుగంటే అవతలి వైపు నుండి నలబై ఆరోపణలు, విమర్శలు వస్తాయని పవన్ కు తెలీదా ?
ఇపుడిదంతా ఎందుకంటే ఉత్తరాంధ్రలో వారాహియాత్ర మొదలుపెట్టారు. అందులో భాగంగా రూటుమ్యాపులో లేకపోయినా తనిష్టప్రకారం రుషికొండకు వెళ్ళారు. పోలీసులు అడ్డుకుంటున్నా లెక్కచేయకుండా రుషికొండకు మీడియాను తీసుకుని వెళ్ళారు. అక్కడకు వెళ్ళి ఏమిచేశారంటే ఒక నిర్మాణాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇన్నిళ్ళంటు పదేపదే ప్రశ్నించారు. దోచుకున్నది, దాచుకున్నది సరిపోలేదా ? అంటూ నిలదీశారు. తెలంగాణాలో భూకబ్జాలు చేసిన కారణంగానే జగన్ను తరమిశారంటు నానా రచ్చచేశారు.
ఇక్కడే జగన్ అంటే పవన్లో ఎంత అక్కసు పేరుకుపోయిందో అర్ధమైపోతోంది. మొదటగా పవన్ చూపించిన నిర్మాణం జగన్ ఇల్లా లేకపోతే ఆఫీసా అన్నది తెలీదు. ఒకవేళ ఇల్లే అని అనుకున్నా కడుతున్నది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం కడుతున్నది కాబట్టి సదరు నిర్మాణం ప్రభుత్వానిది అవుతుందే కానీ జగన్ సొంతంకాదు. జగన్ కు బెంగుళూరు, హైదరాబాద్, ఇడుపుల పాయ, కడప, తాడేపల్లిలో ఇళ్ళున్నమాట వాస్తవమే. అవన్ని వైఎస్ కుటుంబం సొంతంగా సమకూర్చుకున్నవి. వాటి గోల పవన్ కు ఎందుకు ? చంద్రబాబుకు హైదరాబాద్, నారావారిపల్లె, ఉండవల్లి కరకట్టలో ఇళ్ళు లేవా ? కుప్పంలో కట్టుకోవటంలేదా ? పవన్ కు కూడా రెండో మూడో ఇళ్ళు ఉండేవుంటాయి కదా ?
రుషికొండ మీద ప్రభుత్వం కడుతున్న నిర్మాణం జగన్ సొంతమెలా అవుతుందని పవన్ అనుకున్నారో అర్ధంకావటంలేదు. ఇక్కడే పవన్లోని అజ్ఞానమంతా బయటపడిపోయింది. తన అజ్ఞానాన్ని బయటపెట్టుకునేందుకు రుషికొండకు వెళ్ళే విషయంలో పవన్ ఇంత గోలచేయాలా ? ఆశ్చర్యంగా లేదూ పవన్ వ్యవహారమంతా ?