తన మాటలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ వక్రీకరించటంపై వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణమూర్తి ఫుల్ ఫైరైపోయారు.  ఉత్తరాంధ్రలో పవన్  వారాహియాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలోనే పవన్ మాట్లాడుతు ఎంపీని రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. ‘నిన్ను గెలిపించింది విశాఖను వదిలి పారిపోతావని కాదు’ అంటు పవన్ నోటికొచ్చింది మాట్లాడారు. ఇంతకీ పవన్ చెప్పిందేమిటంటే ఎంపీ వైజాగ్ వదిలేసి హైదరాబాద్ వెళిపోతారనన్నారట.




అందుకనే మూర్తిని జనాలు ఎంపీగా గెలిపించింది వైజాగ్ వదిలి పారిపోతావని కాదంటు రెచ్చిపోయారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మూర్తి ఏరోజు కూడా తాను వైజాగ్ వదిలేసి పారిపోతానని చెప్పలేదు. వైజాగ్ లోని తన వ్యాపారాలను హైదరాబాద్ కు మార్చుకుంటానని మాత్రమే చెప్పారు. అదికూడా దేనికంటే తన వల్ల ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా పదేపదే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్లు చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా బిజీగా ఉండే మూర్తి తన ప్రాజెక్టుల్లో ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా వెంటనే ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా జగన్ను టార్గెట్ చేస్తున్నట్లు చెప్పారు.




తన వల్ల జగన్ కు ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశ్యంతోను, ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా వేధింపుల వల్లే తాను వైజాగ్ లో వ్యాపారాన్ని మూసేయాలని అనుకున్నట్లు స్పష్టంగా చెప్పారు. అంతేకానీ తాను ఎంపీగా వైజాగ్ వదిలి హైదరాబాద్ కు పారిపోతానని ఎప్పుడూ చెప్పలేదు.





తాను అనని మాటలను అన్నట్లుగా పవన్ చెప్పటంపై ఎంపీ మీడియా సమావేశంలో ఉతికి ఆరేశారు. తాను చెప్పని మాటలను చెప్పినట్లు పవన్ ఎందుకు అబద్ధాలు చెప్పారో తనకు అర్ధంకావటంలేదన్నారు. రెండుచోట్ల పోటీచేసి ఓడిపోయిన పవన్ తనగురించి మాట్లాడటం ఏమిటంటు ఎంపీ రెచ్చిపోయారు. తనను రాజీనామా చేయమని డిమాండ్ చేయటానికి పవన్ కున్న అర్హత ఏమిటని నిలదీశారు. చంద్రబాబునాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకుని వైసీపీ ప్రభుత్వంపై నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునేదిలేదని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎంఎల్ఏగా కూడా గెలవలేని వ్యక్తి తన గురించి మాట్లాడటం ఏమిటంటు ఎంపీ నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: