జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి  కేంద్రప్రభుత్వం పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఎలాగంటే ఇపుడు అయినదానికి కానిదానికి హైకోర్టు ఉన్నతాధికారులను కోర్టుకి పిలిపిస్తోంది. ఇదే విషయమై ప్రభుత్వం ఎన్నిసార్లు అభ్యంతరాలు చెప్పినా వినిపించుకోవటంలేదు. ఉన్నతాధికారులను కోర్టుకు పిలిపించుకోవటమే కాకుండా కొందరు జడ్జీలు నోటికొచ్చిన కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను చాలా చీపుగా మాట్లాడుతున్నారు. అభ్యంతరకరమైన కామెంట్లు చేస్తున్నారు.





విచారణ సందర్భంగా ఇవన్నీ చేస్తున్నారని అనుకుంటే మళ్ళీ తీర్పుల్లో ఇవేమీ కనబడటంలేదు. కేవలం విచారణ సందర్భంగా జడ్జీలు చేస్తున్న వ్యాఖ్యలను పట్టుకుని ఎల్లోమీడియా జగన్ ప్రభుత్వంపై నానా బురదచల్లేస్తోంది. విచారణ సందర్భంగా చేసే కామెంట్లనే తీర్పుల్లో కూడా పెట్టమని ప్రభుత్వం చెబితే జడ్జీలు దానిగురించి మాట్లాడటంలేదు. ఇదే విషయమై జగన్ ఒకసారి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రింకోర్టుకు ఫిర్యాదు చేసి వదిలేశారు. అయినా జడ్జీల వైఖరిలో మార్పురాలేదు.





అయితే సడెన్ గా కేంద్రప్రభుత్వం సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు ఒక సర్క్యులర్ ఇచ్చింది. అందులో ప్రభుత్వ ఉన్నతాధికారులను ఎంతో అవసరమని అనుకుంటే తప్ప కోర్టుకు పిలిపించవద్దని స్పష్టంగా చెప్పింది. ఉన్నతాధికారుల వ్యవహారశైలిపై వ్యాఖ్యలు చేయటం, ప్రభుత్వంపై కామెంట్లు చేయటం లాంటివి ఇకనుండి తీవ్ర అభ్యంతరంగా పరిగణించబోతున్నట్లు చెప్పింది. ఏపీ హైకోర్టు గతంలో ఒక కేసులో డీజీపీని ఉదయం కోర్టుకు పిలిపించి సాయంత్రం వరకు అట్టేపెట్టింది. నిజానికి డీజీపీని కోర్టులో అన్నిగంటలు అట్టిపెట్టుకోవాల్సిన అవసరమే లేదు.





అయినా తాము చెబితే ప్రభుత్వమైనా, ఉన్నతాధికారులైనా వినితీరాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు జడ్జీలు. ఇలాంటి వాళ్ళకు కేంద్రప్రభుత్వం జారీచేసిన సర్క్యులర్ మింగుడుపడనిదనే చెప్పాలి. కాస్త అటుఇటుగా సుప్రింకోర్టు కూడా గతంలోనే ఇలాంటి సూచనలు చేసినా కొందరు జడ్జీలు పట్టించుకోవటంలేదు. దాంతో ఏపి ప్రభుత్వానికి-హైకోర్టుకు మధ్య ఘర్షణ వాతావరణం కనబడేది. అయితే ప్రశాంత్ కుమార్ మిశ్రా చీఫ్ జస్టిస్ గా వచ్చిన తర్వాత ఆ వాతావరణం మారింది. ఏదేమైనా ఇపుడు కేంద్రం జారీచేసిన సర్క్యులర్ జగన్ ప్రభుత్వానికి రిలీఫ్ అనేచెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: